హెచ్. వినోద్ దర్శకత్వంలో నటుడు విజయ్, నటి పూజా హెగ్డే నటిస్తున్న జన నాయగన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై లేటెస్ట్ సమాచారం లీక్ అయింది. ఇంతకీ విజయ్ సినిమా రిలీజ్ ఎప్పుడు?
సౌత్ సినిమాలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతూ వస్తునన దళపతి విజయ్.. సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆయన చివరి సినిమాగా జననాయకుడు తెరకెక్కుతోంది. "జన నాయగన్" సినిమానే చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించారు.
25
విజయ్ చివరి సినిమాలో ఎవరెవరు నటించారు?
ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో దళపతి విజయ్‌తో పాటు మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్, నరేన్ లాంటి చాలా మంది ప్రముఖులు నటించారు. మహిళల భద్రత, రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఆయన సంగీతంలో విడుదలైన పాటలు ఇప్పటికే అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
35
విజయ్ దళపతి సినిమాకు సెన్సార్ సమస్య
ఈ సినిమాను 2026 జనవరి 9న థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ ప్లాన్ చేసింది. కానీ, అనుకోకుండా సెన్సార్ సమస్యల వల్ల ఆ రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో, చిత్ర బృందం వేసిన కేసును వెనక్కి తీసుకోవచ్చని ఇటీవల సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సినిమా విడుదల ఎప్పుడనే ప్రశ్న అభిమానుల్లో పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో, విదేశాల్లో పనిచేసే "సినీ వరల్డ్" అనే లండన్ ఆధారిత టికెట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జన నాయగన్ సినిమా ఫిబ్రవరి 20న విడుదలవుతుందని ప్రకటించింది. ఈ సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి, దళపతి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. శివకార్తికేయన్ నిర్మించిన 'తాయి కిళవి' సినిమా కూడా ఫిబ్రవరి 20నే రిలీజ్ కావడం గమనార్హం.
55
అధికారిక ప్రకటన చేయలేదు
అయితే, ఈ కొత్త రిలీజ్ డేట్ గురించి జన నాయగన్ చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే, ఈ సమాచారం నిజం కావాలని ఆశిస్తూ అభిమానులు తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో పంచుకుంటున్నారు. సినిమా సరైన విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని దళపతి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.