Vijay Salary: ఒక సినిమాకు రూ. 200 కోట్ల పారితోషికం తీసుకునే విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? జయలలిత, కరుణానిధి శాలరీ చరిత్ర ఏంటి? అనేది చూద్దాం.
దళపతి విజయ్ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్ హీరో. రజనీకాంత్, కమల్ హాసన్ తరం తర్వాతి హీరోల్లో విజయ్‌ని మించిన స్టార్ లేరని చెప్పొచ్చు. అయితే విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లాడు. ఏకంగా సీఎం కూడా అయ్యాడు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనదైన స్టయిల్‌లో ట్రెండ్ సెట్టర్ సీఎంగా నిలుస్తున్నాడు. మరి హీరోగా రూ.200కోట్ల పారితోషికం తీసుకునే విజయ్, ఇప్పుడు సీఎంగా ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది చూస్తే. నెలకు కేవలం 2 లక్షల రూపాయలే కావడం గమనార్హం. '200 కోట్లు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? మా అన్న రోల్స్ రాయిస్ కారుకు పెట్రోల్ పోయించడానికి కూడా ఇది సరిపోదు' అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
25
ఆదాయం తగ్గినా విజయ్ డోంట్ కేర్
ఆదాయం పాతాళానికి పడిపోయినా విజయ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే, తమిళనాడు రాజకీయాల్లో జీతాల చరిత్రే అలా ఉంది. 1991లో జయలలిత మొదటిసారి సీఎం అయినప్పుడు, 'ప్రజాసేవకు వచ్చాను' అని చెప్పి నెలకు కేవలం 1 రూపాయి జీతం తీసుకున్నారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, ఆ ఒక్క రూపాయి జీతం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది. అలాగే, కరుణానిధి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చాలాసార్లు తన జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
35
ముఖ్యమంత్రి జీతం ఇలా పెరిగింది
కాలం మారేకొద్దీ, పెరిగిన ధరలకు అనుగుణంగా రాజకీయ నాయకుల జీతాలు కూడా పెరిగాయి. 2018లో అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం, తమిళనాడు ముఖ్యమంత్రి జీతాన్ని అలవెన్సులతో కలిపి సుమారు రూ. 2.05 లక్షలుగా నిర్ణయించారు. దాని ప్రకారమే, మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్ అందుకున్న జీతాన్నే ఇప్పుడు విజయ్ కూడా తీసుకుంటున్నారు. సినిమా మార్కెట్‌లో శిఖరాగ్రంలో ఉన్న విజయ్, ఇప్పుడు పక్కా రాజకీయ నాయకుడిగా మారి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తన బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకున్నారు.
సినిమాల్లో కోట్లు చూసిన విజయ్, ఇప్పుడు 2 లక్షల రూపాయల బడ్జెట్‌లో ఎలా లైఫ్ లీడ్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను దోచుకునే వాళ్లను చూసి, 'ప్రజల ఒక్క పైసా కూడా ఎవరూ ముట్టుకోలేరు, ముట్టుకుంటే వదలను' అని అసెంబ్లీలో గర్జిస్తున్నారు. 'మీరు సినిమా షూటింగ్ సెట్ నుంచి నేరుగా వచ్చారు' అని ప్రతిపక్షాలు విమర్శిస్తే, 'మేము అభిమాన సంఘంలో ఉన్నప్పుడే స్టెర్లైట్, జల్లికట్టు విషయాల్లో ప్రజలతో నిలబడ్డాం' అని మన సీఎం సమాధానం చెప్పడం విశేషం.
55
సినిమాలకు టాటా చెప్పేశారు
విజయ్ జీతం ఆయన కారు పెట్రోల్ ఖర్చుకు సరిపోతుందో లేదో గానీ, ఆయన అమలు చేస్తున్న కొత్త పథకాలు తమిళనాడు రాజకీయాల్లో 'మాస్టర్' క్లాస్ అనిపిస్తున్నాయి. కోట్లు తెచ్చిపెట్టే సినిమాలకు 'టాటా' చెప్పేసి, ఈ 2 లక్షల రూపాయల జీతాన్ని సంతోషంగా స్వీకరించిన విజయ్ జనాల్లో మంచి సీఎంగా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ బ్యాంక్‌ల్లో మూడు వందల కోట్లకుపైగా ఎఫ్‌డీ చేశారు. అంటే నెలకు లక్షల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. వాటితో లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది.