తమిళ రాజకీయాల్లో విక్టరీ జెండా ఎగరేసిన విజయ్.. 50 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, ఎంతో చురుగ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెరుపు వేగంతో డ్యాన్స్ చేస్తూ అదరగొడతారు. ఆయన ఎనర్జీ రహస్యం ఏంటో తెలుసా?
తమిళనాడు సీఏం సీటులో కూర్చోబోతున్నాడు దళపతి విజయ్. సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగిన విజయ్.. పార్టీ పెట్టిన రెండేళ్లలో సీఎం స్థాయికి ఎదిగాడు. 50 ఏళ్ల వయసులో దళపతి యంగ్ లుక్ లో మెరిసిపోతున్నాడు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.
ఇంతకీ ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? గంటల తరబడి జిమ్‌లో బరువులు ఎత్తడం కన్నా, తన స్టామినా పెంచే కార్డియో వ్యాయామాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రోజూ ఉదయం 10 నుంచి 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు.
28
విజయ్ ఫుడ్ సీక్రెట్..
విజయ్ కఠినమైన డైట్ ఏదీ పాటించరు. కానీ, ఆయన పాటించే ఏకైక ఫుడ్ సీక్రేట్ "మితాహారం". తనకు నచ్చిన ఆహారాన్ని తింటారు, కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా.. అతిగా తినడం అలవాటు లేదు విజయ్ కి.
38
షూటింగ్ లో కూడా ఇంటి భోజనమే..
షూటింగ్ స్పాట్‌లో కూడా విజయ్ చాలా సింపుల్‌గా ఉండే ఇంటి భోజనాన్నే ఇష్టపడతారు. ముఖ్యంగా, మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పెరుగు అన్నం లేదా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు.
విజయ్ తన డైట్ లో ఆయిల్ చాలా తక్కువ ఉండేట్టు చూసుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప, నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్‌ను విజయ్ అస్సలు ముట్టుకోరు. ఆయన 'క్లాసీ' లుక్‌కు ఇదే ముఖ్య కారణం. ఫ్యాట్ ను పెంచే ఏ ఆహారం అయినా దూరంగా ఉంచుతారు.
58
రాత్రి భోజన రహస్యం ఇదే
విజయ్ ఫిట్‌నెస్‌లో అసలు రహస్యం ఆయన రాత్రి భోజనం చేసే సమయం. నిద్రపోవడానికి 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేస్తారు. సాధారణంగా రాత్రి 7 గంటలకే తేలికపాటి ఆహారం తీసుకుంటారు. తిన్న తరువాత వెంటనే నిద్రపోకుండా రెండు గంటలు ఏదో ఒక పని చేస్తుంటారు.
68
డ్యాన్స్ మూమెంట్స్ తో వ్యాయామం..
విజయ్ సినిమాల్లోని పాటల కోసం చేసే కఠినమైన డ్యాన్స్ మూమెంట్సే ఆయనకు ఒక పూర్తిస్థాయి వ్యాయామం. ఒక పాటకు రిహార్సల్ చేసేటప్పుడే ఆయన ఎన్నో కేలరీలను బర్న్ చేస్తారు. ఇదే ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
78
విజయ్ యంగ్ లుక్ కు మరో కారణం..
శారీరక వ్యాయామమే కాదు, విజయ్ ప్రశాంతమైన ముఖం వెనుక ఉన్నది ఆయన 'మైండ్ సెట్'. షూటింగ్ టెన్షన్ల మధ్య ప్రశాంతంగా ఉండటం, సరిపడా నిద్రపోవడం ఆయన యవ్వనాన్ని మరింత పెంచుతాయి.
88
నిరంతర సాధన చాలా ముఖ్యం..
"ఒకే రోజులో ఫిట్ బాడీ రాదు. ఓపిక, నిరంతర సాధన, ఆహారంలో నియంత్రణ ఉంటే 50 ఏళ్లలోనూ ఎనర్జీగా ఉండొచ్చు" ఇదే దళపతి విజయ్ తన అభిమానులకు చెప్పే పాఠం. విజయ్ తన బాడీని ఎలాగైనా మార్చగలడు.. ఎందుకంటే.. ఫుడ్, జిమ్, ఇతర అలవాట్ల విషయంలో విజయ్ తనను తాను కంట్రోల్ చేసుకోగలడు.