Thalapathy Vijay Net Worth: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్ దళపతి. వందల కోట్ల రూపాయల నెట్ వర్త్, లగ్జరీ కార్లు, విల్లాలు ఆయన సొంతం. విజయ్ మొత్తం సంపాదన ఎంతో తెలుసా?
తమిళ సినీ పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ సంచలన ఫలితాలు సాధించింది. 100కు పైగా స్థానాల్లో తనదైన మార్కు చూపిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారు విజయ్.
సూపర్‌స్టార్ నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్ ఆస్తుల విలువ ఎంత? ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దళపతి ఆస్తుల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
26
624 కోట్ల ఆస్తులు.. నో అప్పులు
విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం, ఆయన మొత్తం నికర ఆస్తి విలువ సుమారు 624 కోట్ల రూపాయలు. ఇందులో చరాస్తులు 404 కోట్ల రూపాయలు కాగా, స్థిరాస్తులు 220 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. తాను పైసా అప్పు కూడా లేనని అందులో ప్రకటించారు. ఆయన ఎటువంటి బ్యాంక్ లోన్లు గానీ, ఇతర ఆర్థిక బకాయిలు గానీ లేవని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ విజయ్ ఆదాయం ఏకంగా 184.53 కోట్ల రూపాయలుగా నమోదైంది.
36
బ్యాంకులోనే 200 కోట్లు.. వంద కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
చాలామంది స్టార్ హీరోలు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, విజయ్ మాత్రం సేఫ్ గేమ్‌ను ఎంచుకున్నారు. ఆయనకు షేర్ మార్కెట్‌లో కేవలం 20 లక్షల లోపే పెట్టుబడులు ఉన్నాయి. కానీ, బ్యాంకు నిల్వలు చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఒక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలోనే ఆయనకు 213 కోట్ల రూపాయల నగదు ఉంది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ (40 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (20 కోట్లు), ఎస్‌బీఐ (15 కోట్లు) వంటి బ్యాంకుల్లో సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన వద్ద 2 లక్షల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
విజయ్ స్థిరాస్తుల విషయానికి వస్తే, చెన్నైలోని నీలాంకరైలో ఆయనకు ఒక అద్భుతమైన బీచ్ ఫేసింగ్ బంగళా ఉంది. దీని విలువ దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. హాలీవుడ్ స్టార్ టాం క్రూజ్ బీచ్ హౌస్ డిజైన్‌తో ఇన్‌స్పైర్ అయి ఈ ఇంటిని నిర్మించుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నీలాంకరైతో పాటు సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మూర్ వంటి ప్రాంతాల్లో విజయ్‌కు కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. అలాగే కొడైకెనాల్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి.
56
గ్యారేజీ నిండా కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు
విజయ్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న ఒక్కో కారు విలువ కోట్లలో ఉంటుంది. అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద ఉన్న కార్ల లిస్ట్ ఇదే..
• టొయోటా లెక్సస్ 350: రూ. 3.01 కోట్లు
• బీఎండబ్ల్యూ i7: రూ. 2 కోట్లు
• టొయోటా వెల్‌ఫైర్: రూ. 1.63 కోట్లు
• బీఎండబ్ల్యూ 530: రూ. 80.54 లక్షలు
ఇవే కాకుండా రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఫోర్డ్ మస్టాంగ్ వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా ఆయన వద్ద ఒక మారుతీ స్విఫ్ట్ కారు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ బైక్ కూడా ఉండటం విశేషం.
66
విజయ్ వ్యక్తిగత జీవితం ఇదే
విజయ్ భార్య సంగీత ఆస్తి విలువ సుమారు 15.76 కోట్ల రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విజయ్‌కు సుమారు 883 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి, వీటి విలువ 1.20 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. సినిమాల ద్వారా వచ్చే పారితోషికం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రాపర్టీల ద్వారా వచ్చే అద్దెలు విజయ్‌కు ప్రధాన ఆదాయ వనరులు. విజయ్ తన సంపాదనలో కొంత భాగాన్ని కుటుంబ సభ్యులకు రుణాల రూపంలో కూడా ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో కింగ్ గా మారుతున్న విజయ్ దళపతి, తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా అంతే పక్కాగా నిర్మించుకున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి.