విజయ్, సంగీత ఇద్దరి లాయర్లు తమ క్లయింట్లు ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతారని కోర్టును కోరారు. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు. విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. అసలు విషయం ఏంటంటే, విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో సంబంధం ఉందని సంగీతకు తెలిసిందట. పిటిషన్‌లో ఆ నటి పేరు చెప్పకపోయినా, సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో త్రిష కృష్ణన్‌తో విజయ్ పేరు ఎక్కువగా వినిపించింది కాబట్టి, అది త్రిషనే అని అందరూ ఊహిస్తున్నారు.
ఈ సంబంధం గురించి తెలిసి సంగీత గొడవ చేయగా, ఆ సంబంధాన్ని ముగించేస్తానని విజయ్ మాటిచ్చారట. కానీ, రహస్యంగా ఆ బంధాన్ని కొనసాగించారని సంగీత ఆరోపించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆ నటి సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నా విజయ్ ఏమీ అనలేదని, ఇది తనకు, తన పిల్లలకు తీవ్ర అవమానం, మానసిక క్షోభ కలిగించిందని సంగీత పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం.