`సేవ్ ది టైగర్స్` వెబ్ సిరీస్ ఇప్పటి రెండు సీజన్లు విజయవంతంగా రన్ అయ్యింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ వచ్చింది. `సేవ్ ది టైగర్స్ 3` పేరుతో దీన్ని రూపొందించారు దర్శకుడు మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం. దీనికి శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, గుండు సుదర్శన్, అవినాష్, అభయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూడో సీజన్ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.