ఇటీవల చెన్నైలో వారసుడు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ భార్య సంగీత హాజరు కాలేదు. అలాగే దర్శకుడు అట్లీ సతీమణి సీమంతం వేడుకలో కూడా సంగీత కనిపించలేదు. దీనితో విజయ్, సంగీత మధ్య విభేదాలు మొదలయ్యాయా.. వీరిద్దరూ దూరంగా ఉంటున్నారా అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇవి పూర్తిగా అసత్యమైన వార్తలు అని తేలింది.