Prabhas: అసలు హీరో అవ్వాలనుకోలేదు... ఆ రోజుల్లో నేను కన్న కలలు అవే!

First Published Jan 5, 2023, 3:22 PM IST

ప్రభాస్ హీరో కాకపోతే ఏమయ్యేవారో ఇటీవల వెల్లడించారు. అసలు ఎప్పుడూ నటుడు అవుతానని అనుకోలేదన్న ప్రభాస్ చదువుకునే రోజుల్లో తన కలేమిటో తెలియజేశారు. 
 


దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అవతరించాడు ప్రభాస్. సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లు. పలు భాషల్లో మార్కెట్ కలిగిన హీరో. కనీసం రూ. 500 కోట్లు ఉంటేనే ఆయనతో సినిమా చేయాలి. బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన హీరో. ఆయన ప్లాప్ మూవీ కూడా వందల కోట్ల వసూళ్లు అందుకుంటుంది. 


ప్రభాస్(Probhas) హీరోగా ఆదిపురుష్, సలార్(Salaar), ప్రాజెక్ట్ కే(Project K), రాజా డీలక్స్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం కలిపితే రూ. 2000 కోట్లు. ఒక పరిశ్రమ ఏడాదిలో చేసే సినిమాల మొత్తం బడ్జెట్ కూడా ఇంత ఉండదేమో. షార్ట్ గా చెప్పాలంటే ప్రభాస్ స్టామినా అది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. 
 


మరి ఇంత పెద్ద స్టార్ ప్రభాస్... ఎప్పుడూ నటుడు కావాలి అనుకోలేదట. తన డ్రీం ఇది కాదట. నటుడ్ని అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. వ్యాపారం చేయలేనిది నా కల. అందులోనూ హోటల్ బిజినెస్ పై మక్కువ ఉండేది. ఆ రంగంలో రాణించాలి అనుకున్నాను. నేను పెద్ద ఫుడ్డీని, బహుశా అందుకే హోటల్ బిజినెస్ వైపు నా మనసు మళ్ళి ఉంటుంది. 
 


అయితే ఆ రోజుల్లో మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. హోటల్ బిజినెస్ అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. డబ్బులు లేక ఆ బిజినెస్ ఆలోచనలు మానుకున్నాను, అని ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సో.. ప్రభాస్ హీరో కాకుంటే వ్యాపారస్తుడు అయ్యేవాడు. 
 


విధి రాతను ఎవ్వరూ మార్చలేరంటారు. అలాగే ప్రభాస్ హీరో కావాలని ఉంటే... ఆయన అడుగులు బిజినెస్ వైపు ఎందుకు పడతాయి. లక్షల కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్ మాన్ అయినా హీరోకి ఉన్నత ఫేమ్, అభిమానగణం ఉండరు కదా. హీరో కావడం వలన ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అదే. సమాజంలో కీర్తి, గౌరవం, ప్రేమాభిమానాలు పొందవచ్చు. 

టైం బాగుంటే సీఎం కూడా కావచ్చు. ప్రభాస్ గాడ్ ఫాదర్ కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా రాణించారు. కృష్ణంరాజు బీజేపీ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నాడు. ప్రభాస్ కి కూడా రాజకీయాలతో కొంచెం టచ్ ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ప్రభాస్ కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరాళంగా ఇచ్చారు. అందరూ లక్షల్లో ఇస్తుంటే ఆయన కోట్లు ఇచ్చారు.

click me!