ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్, కాకరేపుతున్న విజయ్ చివరి చిత్రం పోస్టర్!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న థ‌ళ‌ప‌తి విజ‌య్ 69వ చిత్రం ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్ విడుద‌లైంది. రాజ‌కీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్ట‌నున్న విజ‌య్ న‌ట‌న‌కు వీడ్కోలు ప‌లుకుతున్నార‌ని, ఇదే ఆయ‌న చివ‌రి సినిమా అని స‌మాచారం.

GOAT మూవీ

సెప్టెంబ‌ర్ 5న విడుద‌లైన దళ‌ప‌తి విజ‌య్ న‌టించిన ది గోట్' చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్రభుదేవా, లయ, ప్రశాంత్ వంటి స్టార్ క్యాస్ట్ న‌టించిన 'ది గోట్' రెండో వారంలోనూ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ అందుకుంటుంది. తెలుగులో మాత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. 

యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు నిర్మాణ విలువలు మెప్పించాయి. కథలో పట్టులేదు. స్క్రీన్ ప్లే తేలిపోవడంతో ది గోట్ టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. ది గోట్ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. 

థ‌ళ‌ప‌తి 69

ది గోట్ ఫలితం పక్కన పెడితే...  విజ‌య్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇది ఆయన చివరి చిత్రం అనే ప్రచారం కూడా జరుగుతుంది.  విజయ్ కొత్త మూవీ ప్రకటన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్న 'కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్' సంస్థ థ‌ళ‌ప‌తి విజ‌య్‌తో తొలి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రకటన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా ఆసక్తి రేపింది.  త్వరలో ప్రజాస్వామ్యానికి దారి చూపేవాడు వస్తున్నాడు, అనే క్యాప్షన్ ఉంది.  మంట‌లు ఎగిసిప‌డుతున్న టార్చ్ పట్టుకున్న చేతిని మనం చూడొచ్చు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2025 అక్టోబ‌ర్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్

ఈ చిత్రంలో న‌టించే న‌టులు, సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉంది. ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం మాత్రమే పంచుకున్నారు. 

కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ 2021లో క‌న్న‌డ భాష‌లో విడుద‌లైన 'స‌కాత్' చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ ఆర్ ఆర్ ఆర్ తో పాటు పలు తెలుగు సినిమాలను కన్నడలో విడుదల చేసింది. అలాగే సూర్య లేటెస్ట్ మూవీ కంగువ చిత్రాన్ని నిర్మిస్తుంది. 
 

టీవీకే

'కంగువ' విష‌యానికి వ‌స్తే ఆ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో క‌లిసి నిర్మిస్తోంది కాబ‌ట్టి, థ‌ళ‌ప‌తి 69వ చిత్రం ఈ సంస్థ త‌మిళంలో అధికారికంగా నిర్మిస్తున్న తొలి చిత్రంగా చెప్పవచ్చు. కెవిఎం ప్రొడక్షన్స్ కోలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది. 

ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ 'త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. హెచ్. వినోద్ తో చేస్తున్న  సినిమా పూర్తి చేసిన అనంతరంనటనకు శాశ్వతంగా 'గుడ్‌బై' చెప్పనున్నాడు. పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా కొనసాగుతానని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026లో జ‌రిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా పోటీ చేసే అవ‌కాశం ఉంది.

తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎంజీఆర్, జయలలిత తమదైన ముద్ర వేశారు. విజయ్ కాంత్ పాక్షికంగా సక్సెస్ అయ్యారు. ఇక కమల్ హాసన్ అట్టర్ ప్లాప్ అని చెప్పాలి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ఊరించి ఉసూరుమనిపించాడు. మరి విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి...

Latest Videos

click me!