ఆ తర్వాత సందీప్.. సైఫ్ అలీ ఖాన్ ని అడిగిన ప్రశ్న అయితే అందరికీ షాకింగ్. మిమల్ని ఫస్ట్ పార్ట్ లోనే చంపేస్తారా లేక సెకండ్ పార్ట్ లో కూడా ఉంటారా అని సందీప్ అడిగారు. దీనితో షాక్ కి గురికావడం సైఫ్ అలీ ఖాన్ వంతైంది. ఎన్టీఆర్ అయితే యాక్షన్ సన్నివేశాలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసేలా ఉంటాయి అని అంచనాలు పెంచేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు.