నేను బలవంతంగా సినిమాలు మానేయొచ్చు, అప్పు తీర్చడానికే హీరో అయ్యా.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన అజిత్

Published : May 02, 2025, 05:42 PM IST

అభిమానులు అజిత్ కుమార్ ని ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. అజిత్ చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 

PREV
15
నేను బలవంతంగా సినిమాలు మానేయొచ్చు, అప్పు తీర్చడానికే హీరో అయ్యా.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన అజిత్
ajith kumar admitted to hospital

అభిమానులు అజిత్ కుమార్ ని ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. అజిత్ చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇటీవలే అజిత్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

25
Ajith Kumar

అజిత్ మాట్లాడుతూ.. తాను బలవంతంగా సినిమాల నుంచి తప్పుకునే పరిస్థితి రావచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ ని కలవరపెట్టే విధంగా ఉన్నాయి. సినిమాల నుంచి నేను ఎప్పుడైనా తప్పుకోవచ్చు. ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేయకముందే నేను తప్పుకుంటే బావుంటుంది. ఇప్పుడు నా నటన వాళ్ళకి నచ్చుతోంది. భవిష్యత్తులో నచ్చకపోవచ్చు. 

35

ప్రేక్షకుల ఆదరణ ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది అని అజిత్ అన్నారు. నేను స్టార్ హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే హీరో అయ్యా. నా మొదటి సినిమా సమయంలో నాకు నటన అంతగా రాదు. ఆ మూవీలో నా నటన భయంకరంగా ఉంటుంది. కనీసం డబ్బింగ్ కూడా చెప్పగలిగేవాడిని కాదు. వేరొకరు డబ్బింగ్ చెప్పారు. చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆ విమర్శలకు కుంగిపోకుండా సవాలుగా తీసుకుని ఎదిగినట్లు అజిత్ పేర్కొన్నారు. 

45

అదే విధంగా తనకి జీవితం విలువ కూడా తెలుసు అని అజిత్ తెలిపారు. నాకు తెలిసిన వాళ్లలో డబ్బు ఉన్నప్పటికీ జీవితంలో పోరాడే వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు జీవితం విలువ అర్థం అవుతుంది. 

55

అందుకే జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా భావన. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు అజిత్ పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories