ఇక ఇది చూసిన అభి, అంకిత (Ankitha) లు ఒక పక్క నుంచి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు రాములమ్మ (Ramulamma) ఒక అద్దె ఇంటిని ప్రేమ్, శృతి ల కోసం సెట్ చేస్తుంది. అంతే కాకుండా అద్దె 3000 ఇచ్చే లాగా ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడుతుంది. ఇక ప్రేమ్ (Prem) వాళ్ళు తిరిగి వెళుతున్న క్రమంలో మీరు ఎప్పుడైనా చికెన్ చేసుకుంటే మాకు పెట్టాలి అని ఇంటి ఓనర్ ఫన్నీగా కండిషన్ పెడతాడు.