Prabhas: అనుష్కపై రూమర్స్, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. కృష్ణం రాజు సతీమణి లేటెస్ట్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 09, 2022, 01:11 PM IST

కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే అనుష్కపై వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించారు.   

PREV
16
Prabhas: అనుష్కపై రూమర్స్, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. కృష్ణం రాజు సతీమణి లేటెస్ట్ కామెంట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాపై ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది. 

26

300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ లో చూపిన విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. కనీవినీ ఎరుగని అంచనాల నడుమ మార్చి 11న రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అలాగే ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. 

 

36

రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా కృష్ణం రాజు సతీమణి కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ ఫ్యామిలీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎదురయ్యే కామన్ క్వశ్చన్.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ?తాజాగా ఇదే ప్రశ్న కృష్ణం రాజు భార్య శ్యామలాదేవికి కూడా ఎదురైంది. తాజాగా ఇంటర్వ్యూలో శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి.. అనుష్కతో ఎఫైర్ లాంటి రూమర్స్ పై స్పందించారు. 

46

ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై శ్యామలాదేవి మాట్లాడుతూ.. ప్రభాస్, అనుష్క లకి పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ ఉద్దేశం లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వారి మధ్య ప్రేమ లాంటి ఫీలింగ్స్ లేవు అని అన్నారు. రూమర్స్ ని ఆమె ఖండించారు. 

56

ఇక ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. బాబు తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. కానీ అది ఎప్పుడు అనేది చెప్పలేం. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అని శ్యామల దేవి అన్నారు. ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని ఆమె అన్నారు. పెళ్లి అంటే ప్రభాస్ కు చాలా గౌరవం ఉంది. మహిళలంటే ప్రభాస్ ఎంతో రెస్పెక్ట్ గా ఉంటారని తెలిపారు. 

66

ఇదిలా ఉండగా రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విధికి, ప్రేమకు మధ్య జరిగే యుద్ధంలో విజయం ఎవరిది అనేది ఈ మూవీలో తేలనుంది. చేతి రాతల్ని బట్టి భవిష్యత్తుని చెప్పే విక్రమాదిత్య.. తన ప్రేమని ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే ఈచిత్ర కథ. 

Read more Photos on
click me!

Recommended Stories