నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రంలో 'వండర్ వుమెన్' నటి గాళ్ గోబట్, ప్రముఖ నటుడు జెమీ డోర్నాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా హాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. అలాగే హిందీలో భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో అలియా తన ప్రియుడు రణబీర్ కపూర్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.