తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పూరి, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ ఇలా పదిహేనుకుపైగా భాషల్లో ఇరవై వేలకుపైగా పాటలు పాడిన వాణి జయరాం తెలుగులో మాత్రం `అభిమానవంతులు` అనే చిత్రంతో గాయనిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో `ఎప్పటి వలె కాదురా నా సామి` అనే పాట పాడినట్టు చెప్పింది. ఈ సినిమాకి ఎస్పీ కోదండపాణి సంగీతం అందించగా, డా సినారే రాశారు, శోభానాయుడు డాన్సు చేయడం విశేషం.