Temper Vamsi Remuneration: 12 వారాలకు టెంపర్‌ వంశీకి దక్కిన పారితోషికం ఎంతో తెలుసా? గట్టిగానే కొట్టాడు

Published : Nov 29, 2026, 11:59 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 12వ వారం డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా టెంపర్‌ వంశీ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మరి ఆయనకు పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. మరి ఎంత పొందుతున్నాడంటే?

PREV
13
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన వంశీ

తెలుగు సినిమాల్లో విలన్‌గా పాపులర్‌ అయిన టెంపర్‌ వంశీకి ఇటీవల సినిమాలు తగ్గాయి. అడపాదడపా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఆయనపై విలన్‌ అనే ముద్రనే ఉంది. తాను అన్ని రకాల పాత్రలు చేయగలను, తనలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు బిగ్‌ బాస్‌ షోకి వచ్చాడు వంశీ. బిగ్‌ బాస్‌ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రారంభంలో పెద్దగా కంటెంట్‌ ఇవ్వలేని ఆయన ఆ తర్వాత స్పీడ్‌ పెంచాడు, తన ఫైర్‌ చూపించాడు. అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. కానీ ఆయన నుంచి వచ్చిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా మారాయి. అవి ఆయనపై చాలా ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో 12వ వారం ఆయన ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.

23
టెంపర్‌ వంశీ పారితోషికం

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని చెప్పిన నాగార్జున మొదటి ఎలిమినేషన్‌లో వంశీని ఎలిమినేట్‌ చేశారు. మరి ఈ 12 వారాలు హౌజ్‌లో ఉన్న టెంపర్‌ వంశీకి ఎంత పారితోషికం దక్కిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వంశీకి వారానికి రెండు లక్షల పారితోషికం నిర్ణయించారట. ఈ లెక్కన 12 వారాలకు గానూ ఆయనకు రూ.24లక్షలు దక్కుతుందని చెప్పొచ్చు. టాక్స్ లు పోను మొత్తంగా దాదాపు ఇరవై లక్షల వరకు వంశీ అందుకుంటారు.

33
ప్రైజ్‌ మనీ యాభై లక్షలు

ఈ సారి బిగ్‌ బాస్‌ ప్రైజ్‌ మనీ రూ.35 లక్షలే. మూడో వారంలోనే మిథిలేష్‌ రూ.15లక్షల సూట్‌కేస్‌తో వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే వేరే ప్రైవేట్‌ కంపెనీ ఒకటి దాన్ని భర్తీ చేయబోతుందని, యాభై లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుంది. మరి రెండో ఎలిమినేషన్ ఎవరనేది ఈ రోజు రాత్రి తేలనుంది. వర్షిణి ఎలిమినేట్‌ అవుతుందని అంటున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories