Sai Pallavi: రామాయణంలో నేను సీతగా నటించడం తప్పా? ట్రోలర్స్‌కు సాయి పల్లవి స్ట్రాంగ్ కౌంటర్

Published : Nov 29, 2026, 10:56 AM IST

Sai Pallavi: రామాయణ సినిమాలో సీత పాత్ర చేసిన సాయి పల్లవి లుక్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఆమె ధీటుగా బదులిచ్చారు. విమర్శలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదని, ధైర్యం ఉంటే దేన్నైనా ఎదుర్కోవచ్చని సాయి పల్లవి తేల్చి చెప్పారు.

PREV
14
ట్రోలర్స్‌కు సాయి పల్లవి కౌంటర్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం 'రామాయణ' సినిమాతో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. సీత పాత్రకు ఆమె సరిపోదని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆమె మేకప్ లేకుండా నటించడంపైనా చర్చ జరుగుతోంది.

24
నెగిటివ్ కామెంట్స్‌పై సాయి పల్లవి రియాక్షన్

'వి ది ఉమెన్' కార్యక్రమంలో జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో సాయి పల్లవి మాట్లాడింది. సీత పాత్రకు తనను ఎంపిక చేయడం, తన లుక్‌పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి ఆమె ఓపెన్‌గా స్పందించింది.

సీత పాత్రపై ట్రోల్స్‌కు బదులిచ్చిన సాయి పల్లవి

సీతాదేవి ఎలా ఉండాలి అనే దానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి సాయి పల్లవి మాట్లాడింది. ఇలాంటి విమర్శలకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని ఆమె స్పష్టం చేసింది. "సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. సీతాదేవి ఎంత అందంగా ఉండాలనే కామెంట్స్ చూశాను. అయితే ఆ మాటల వల్ల మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటే, లోపం మీలోనే ఉందన్నమాట" అని తేల్చి చెప్పింది.

34
ధైర్యం ఉంటే ప్రపంచాన్నే ఎదురించవచ్చు

మానసికంగా దృఢంగా ఉండాలని సాయి పల్లవి సూచించింది. ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుందని, కానీ ఇతరుల అభిప్రాయాలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదని ఆమె పేర్కొంది. మనలో ధైర్యం ఉంటే ప్రపంచం చేసే విమర్శలను సులభంగా ఎదుర్కోవచ్చని ఆమె తెలిపింది.

సీత పాత్రతో వచ్చిన మార్పు

సీత పాత్రలో నటించిన తర్వాత జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అన్న ప్రశ్నకు సాయి పల్లవి ఆసక్తికరంగా బదులిచ్చింది. ప్రతి పాత్ర ఆర్టిస్ట్‌పై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని ఆమె చెప్పింది. "నా ప్రయాణం ఒక సినిమా నుంచి మరో సినిమాకి సాగుతూనే ఉంటుంది. ప్రతి పాత్ర మనలో కొన్ని మార్పులు తీసుకువస్తుంది. ఆ పాత్రకు సంబంధించిన ఒక చిన్న భాగాన్ని మనసులో దాచుకుంటాం. నాలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి, కానీ అవన్నీ నా పర్సనల్" అని ఆమె వివరించింది.

44
నో మేకప్ లుక్‌పై నటి కామెంట్స్

తన కెరీర్ ప్రారంభంలో లుక్ గురించి తాను కూడా ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేదాన్నని సాయి పల్లవి గుర్తుచేసుకుంది. అయితే కాలం గడిచేకొద్దీ ప్రేక్షకులకు, నటీనటులకు మధ్య ఉండే కనెక్షన్ తనకు అర్థమైందని ఆమె చెప్పింది. "ప్రేక్షకులు నేచురల్‌గా ఉండటాన్ని ఇష్టపడతారు. అందుకే రియల్ లైఫ్‌లో ఉండే సాధారణ మహిళల పాత్రలనే నేను ఎంచుకుంటాను" అని ఆమె స్పష్టం చేసింది.

ముఖానికి ఫౌండేషన్ లేదా కన్సీలర్ వేసుకుంటే వేరే వ్యక్తిలా కనిపిస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుందని సాయి పల్లవి చెప్పింది. అందుకే తాను నేచురల్ లుక్‌లోనే ఉండటానికి ఇష్టపడతానని ఆమె వివరించింది.

Read more Photos on
click me!

Recommended Stories