తెలుగులో బ్లాక్ బస్టర్స్.. తమిళంలో రీమేక్ చేస్తే ఫ్లాప్.. ఎన్టీఆర్, పవన్, చైతు సినిమాలకు ఈ పరిస్థితా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 02:04 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో కూడా టాలీవుడ్ లో తెరకెక్కిన అనేక సూపర్ హిట్ చిత్రంలో ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. అలా కొన్ని తెలుగు సూపర్ హిట్ చిత్రాలు తమిళంలో రీమేక్ అయి డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ వివరాలు ఇవే. 

PREV
110
తెలుగులో బ్లాక్ బస్టర్స్.. తమిళంలో రీమేక్ చేస్తే ఫ్లాప్.. ఎన్టీఆర్, పవన్, చైతు సినిమాలకు ఈ పరిస్థితా

జులాయి: త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. తమిళంలో హీరో ప్రశాంత్ ఈ చిత్రాన్ని సాహసం పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ ఈ మూవీ డిజాస్టర్. 

210

కిక్ : రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కిక్ చిత్రాన్ని హీరో జయం రవి తమిళంలో 'తిల్లలంగడి' పేరుతో రీమేక్ చేశారు. కానీ ఈ చిత్రం అక్కడ వర్కౌట్ కాలేదు. తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ ఆ నటించింది. 

310

సింహాద్రి: ఎన్టీఆర్ కెరీర్ లో చరిత్ర సృష్టించిన చిత్రం సింహాద్రి. టాలీవుడ్ లో సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఈ చిత్రాన్ని విజయ్ కాంత్ తమిళంలో రీమేక్ చేయగా అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది. 

410

అత్తారింటికి దారేది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, త్రివిక్రమ్ మ్యాజిక్ తో అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని శింబు 'వంత రాజవతాన్ వరువాన్' పేరుతో రీమేక్ చేశాడు. తమిళ ప్రేక్షకులని ఈ చిత్రం ఏమాత్రం మెప్పించలేకపోయింది. 

510

అతనొక్కడే : కళ్యాణ్ రామ్ కెరీర్ లో పవర్ ఫుల్ హిట్ గా నిలిచిన చిత్రం 'అతనొక్కడే'. ఈ చిత్రాన్ని స్టార్ హీరో విజయ్ 'ఆది' పేరుతో రీమేక్ చేయగా విజయం సాధించలేదు. 

610

100%లవ్ : నాగ చైతన్య, తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 100 పర్సెంట్ లవ్. జీవి ప్రకాష్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. 100 పర్సెంట్ కాదల్ గా తెరకెక్కిన ఈ చిత్రం నిరాశపరిచింది. 

710

లక్ష్యం : గోపిచంద్ సూపర్ హిట్ మూవీ లక్ష్యం చిత్రాన్ని హీరో విశాల్ 'వేడి' పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులని తీవ్ర నిరాశకు గురిచేసింది.  

810

ఆర్య : అల్లు అర్జున్ ఆర్య చిత్రానికి ఫిదా కాని వారు ఉండరు. ధనుష్ హీరోగా కుట్టి టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో రీమేక్ అయింది. ఊహించని విధంగా ఈ చిత్రం అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. 

 

910

అలా మొదలైంది :నాని, నిత్యామీనన్ ల కామెడీ ఎంటర్టైనర్ అలా మొదలైంది కూడా తమిళంలో ఆకట్టుకోలేకపోయింది. గౌతమ్ కార్తీక్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. తమిళ రీమేక్ కు ఊహించని షాక్ తప్పలేదు. 

1010

ఇష్క్ :నితిన్, నిత్య మీనన్ నటించిన రొమాంటిక్ మూవీ ఇష్క్. నితిన్ వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన చిత్రం ఇది. సిద్దు, హన్సిక నటించిన తమిళ రీమేక్ ఉయిరే ఉయిరే అక్కడ ఫ్లాప్. 

Read more Photos on
click me!

Recommended Stories