Pawan Kalyan: విసిగిపోయిన ఫ్యాన్స్... పవన్ కే సలహాలు ఇచ్చేస్తున్నారు!

Published : Mar 10, 2022, 01:03 PM IST

నెలల వ్యవధిలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రెండు చిత్రాలు విడుదల చేశారు. దాదాపు మూడేళ్లు రాజకీయాల కారణంగా వెండితెరకు దూరమైన పవన్ ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ తో బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇచ్చారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం నాట్ హ్యాపీ.   

PREV
18
Pawan Kalyan: విసిగిపోయిన ఫ్యాన్స్... పవన్ కే సలహాలు ఇచ్చేస్తున్నారు!

దానికి కారణం వాళ్ళు కోరుకుంటున్న మజా ఈ రెండు చిత్రాలతో వాళ్లకు దక్కలేదు. ఓ భారీ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ని పవన్ నుండి వాళ్ళు ఆశిస్తున్నారు. వకీల్ సాబ్(Vakeel Saab), భీమ్లా నాయక్ రీమేక్స్ కావడం కూడా వాళ్ళ అసంతృప్తికి మరో కారణం. రీమేక్ స్టార్ అంటూ యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తుంటే... పవన్ ఫ్యాన్స్ కి మండిపోతుంది.

28

దానికి తోడు పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కి రెడీ అవుతున్నాడనే వార్త వాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తమిళ హిట్ మూవీ వినోదయ చిత్తం రిమేక్ కి సర్వం సిద్ధమని, పవన్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా మల్టీస్టారర్ చేస్తున్నారని టాలీవుడ్ లో విశ్వసనీయ సమాచారం అందింది.

38

పవన్ పాత్రకు కొంచెం తక్కువ నిడివి ఉండే ఈ మూవీకి పవన్ కేవలం 20 రోజుల డేట్స్ కేటాయించారట. రెమ్యూనరేషన్ మాత్రం రూ 50 కోట్లు తీసుకుంటున్నారట. ఈ రీమేక్ పై ఫ్యాన్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీకు దండం అన్న ఆ రీమేక్ చెయ్యొద్దు అంటూ మొరపెట్టుకున్నారు.

48


ఎవరు ఏమనుకున్నా ఈ రీమేక్ అధికారికమేనని సమాచారం అందుతుంది వరుస రీమేక్స్ తో సహనం కోల్పోయిన పవన్ ఫ్యాన్స్ చివరికి ఆయనకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చేశారు. పవన్ ని ట్యాగ్ చేస్తూ ఆయన ఎలాంటి చిత్రాలు చేయాలో, జోనర్ ఏమిటో, దర్శకుడు ఎవరో... నిర్ణయించేస్తున్నారు. నువ్వు ఫలానా సినిమానే చేయాలన్నా అంటూ తమ డిమాండ్లు ఆయనకు వినిపిస్తున్నారు. 

58

ఇక పవన్ తో మూవీలు ప్రకటించిన దర్శకులకు నిర్మాతలకైతే వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ కి ఫ్యాన్స్ నుండి వస్తున్న డిమాండ్లు చూస్తే విస్తుపోవాల్సిందే. కొంచెం లేటైనా టేకింగ్ అదిరిపోవాలంటా. కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలట. మరో దర్శకుడు హరీష్ శంకర్ కి కూడా ఇదే తరహా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా తయారైంది అంటే వీలైతే కథ, మాటలు, ఫైట్స్ కూడా ఇలా ఉండాలని నిర్దేశించేటట్లు ఉన్నారు.

68


ఓ స్టార్ హీరోతో వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే దర్శక నిర్మాతలు పిచ్చోళ్ళు అన్నట్లు వీళ్ళు సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇవ్వడం. ఎవడో అనామక ఫ్యాన్ ఇలాంటి కామెంట్స్ చేశారంటే పట్టించుకోవాల్సిన పని లేదు.  వేలల్లో, లక్షల్లో ఫాల్లోవర్స్ ఉన్న ఫ్యాన్ పేజెస్, ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్, డిమాండ్స్ చేస్తున్నారు. అయితే పవన్ ఇవన్నీ ఏమీ పట్టించుకోరు. సినిమా అయినా రాజకీయమైనా తనకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. 
 

78

మరోవైపు భీమ్లా నాయక్ (Bheemla nayak)రన్ థియేటర్స్ దగ్గర ముగిసింది. తెలంగాణాతో పాటు ఓవర్ సీస్ లో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఏపీలో మాత్రం నష్టాలు మిగిల్చింది. దీనికి టికెట్స్ ధరలు కారణం చూపుతున్నప్పటికీ తెలంగాణాలో భారీగా ధరలు పెంచినా, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినా కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే అయ్యింది. ఎటువంటి లాభాలు పంచలేదు.  భీమ్లా నాయక్ వంద కోట్ల షేర్ పోస్టర్స్ లో కూడా నిజం లేదనేది ట్రేడ్ వర్గాల వాదన. కేవలం హైప్ కోసం మూవీ కలెక్షన్స్ తప్పుగా చూపించారు.

88


పవన్ రిమేక్ చిత్రాలు ఫ్యాన్స్ కే నచ్చడం లేదు. వాళ్ళు ఆయన స్ట్రైట్ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం వినోదయ చిత్తం, తేరీ చిత్రాల రీమేక్స్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నాడు. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు పక్కనపెట్టి వినోదయ చిత్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories