పింక్ శారీలో అందాల దాడి చేస్తున్న తెలుగు హీరోయిన్.. చీరకట్టులో కవ్వించేలా అంజలి పోజులు

Published : Jun 12, 2022, 03:09 PM ISTUpdated : Jun 12, 2022, 03:16 PM IST

సౌత్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అంజలి. తన గ్లామర్, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. మరోవైపు నెట్టింట కూడా లేటెస్ట్ ఫొటోషూట్లో మతిపోగొడుతోంది.    

PREV
16
పింక్ శారీలో అందాల దాడి చేస్తున్న తెలుగు హీరోయిన్..  చీరకట్టులో కవ్వించేలా అంజలి పోజులు

తెలుగు, తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా ఆడియన్స్ ను అలరించింది అంజలి. ఏ పాత్ర అయినా సమర్థవంతంగా పోషించగలననే విషయాన్ని ఆమె నిరూపించుకుంది. 
 

26

ఈ మధ్య  కాలంలో అంజలికి తెలుగులో అవకాశాలు వస్తున్నా..  తన స్థాయికి తగిన పాత్రలూ పడలేదు. చివరిగా నిశ్శబ్దం, వకీల్ సాబ్ తో ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ చిత్రాలు పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో అంజలికి కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. 

36

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ( Director Shankar) కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్సీ 15’లో ఓపాత్రలో కనిపించనుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ను తను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
 

46

తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది. ఇలా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.  
 

56

తరువాత అంజలి తెలుగులో బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కున్న ప్రాజెక్ట్ లోనూ హీరోయిన్ గా అంజలి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే మెహ్రీన్, ప్రియమణి పేర్లు పరిశీలిస్తున్నారు. అంజలికి ఈ అవకాశం దక్కితే మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  
 

66

మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా పింక్ శారీలో ఓ చెట్టుకింద అందాలను ఆరబోసింది. మతిపోయే ఫోజులతో అంజలి అట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories