నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. మహాబలిపురం చారిత్రాత్మక ప్రాంతం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశం కూడా. కాబట్టి నయనతార విగ్నేష్ శివన్ లు తమ వివాహానికి వేదికగా మహాబలిపురంని ఎంచుకున్నారు.