సినిమా అనే రంగుల ప్రపంచంలో తారలు ముఖానికి మేకప్ లేకుండా బయటకు రారు. సహజ అందాలకు, మేకప్ అందాలకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ మేకప్ లెస్ లుక్ లీక్ చేయడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే ఇది కెరీర్ సంబంధించిన మేటర్.
అయితే మన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. అమ్మడు ధైర్యం ఏమిటో కానీ... తన సహజ సౌందర్యానికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముఖానికి రంగు లేకపోయినా ఈషా రెబ్బా అందంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కనిపించలేదు. ఆమె గ్లామర్ చెక్కు చెదరలేదు.
210
ఈ నయా లుక్ చూసిన ఫ్యాన్స్... ఫన్టాస్టిక్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ ఎడతెరిపి లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈషా తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. సొంత పరిశ్రమలో ఆశించిన గుర్తింపు దక్కకపోవడంతో ఇతర పొరుగు పరిశ్రమలపై కన్నేసింది.
310
ఒట్టు టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీతో ఈషా మలయాళ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయిరామ్ జన్మగల్ అనే తమిళ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది.
410
తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది ఈషా రెబ్బా. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ కనుమరుగయ్యాయి. అందం, అభినయం ఉండి కూడా, కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.
510
బాలీవుడ్ హీరోయిన్స్ స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటూ ఉంటుంటే, ఈషా లాంటి తెలుగు అందాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు.
610
సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెకు కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా, ఈషాకు వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.
710
అక్కినేని హీరో అఖిల్ (Akhil)మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే (Pooja Hegde)లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది.
810
Eesha Rebba
తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.
910
మరో వైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ, దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు. తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది ఈషా. సూపర్ స్టైలిష్ గా ఉన్న ఈషా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారడం జరిగింది. మరి ఈషా ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
1010
Eesha Rebba
ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో నటులకు డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్లు, సినిమాలు విరివిగా తెరకెక్కుతుండగా ఈషా లాంటి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ మధ్య విడుదలైన పిట్ట కథలు ఆంథాలజీ సిరీస్ లో ఈషా నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైంది.