Published : Jan 15, 2024, 10:30 AM ISTUpdated : Jan 15, 2024, 10:32 AM IST
మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి... ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?
తెలుగు చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది యంగ్ బ్యూటీ అవంతికి వందనపు (Avantika Vandanapu). ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. అమెరికన్ ఓటీటీల్లో అవకాశాలతో సత్తా చాటుకుంటోంది.
26
ఇంతకీ అవంతిక వందనపు ఎవరనే విషయానికొస్తే.... తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయినే కావడం విశేషం. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాన్ ఫ్రాన్సిస్ కోలో అవంతిక కుటుంబం స్థిరపడింది. గతంలో హైదరాబాద్ లోనే నివసించే వారు.
36
ఇక ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు ఉంటాయి. 2005 జనవరి 25న జన్మించింది. మరో పదిరోజుల్లో ఈమె పుట్టిన రోజు కావడం విశేషం. ఇదిలా ఉంటే... అవంతిక పదేళ్ల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. తొలుత తెలుగు చిత్రాల్లోనే బాల నటిగా అవకాశాలు అందుకుంది.
46
మహేశ్ బాబు Mahesh Babu ‘బ్రహ్మోత్సవం’, ‘మనమంతా’, చైతూ ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బాల కృష్ణుడు’, ‘ఆక్సిజన్’, పవన్ కళ్యాణ్ Pawan Kalyan ‘అజ్నాతవాసి’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది.
56
కానీ ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ హాలీవుడ్ ఓటీటీ ఫిల్మ్స్ లో దుమ్ములేపుతోంది. వరుసగా ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో అవకాశాలు అందుకుంటూ అదరగొడుతోంది. ఇప్పటికే ‘స్పిన్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్ లో ప్రధాన పాత్రలో నటించి అలరించింది.
66
2022లో సీనియర్ ఈయర్.. ప్రస్తుతం ‘మీన్ గర్ల్స్, హరర్ర్ స్కోప్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ‘ఏ క్రౌన్ ఆఫ్ విషెస్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా జనవరి 12 ‘మీన్ గర్ల్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.