Guppedantha Manasu 15th January Episode:రిషి చనిపోయాడంటూ కాలేజీలో అల్లర్లు సృష్టించిన శైలేంద్ర, వసుకి షాక్

Published : Jan 15, 2024, 07:54 AM IST

ఆ తర్వాత.. వసుధార... శైలేంద్ర ఇక్కడకు వచ్చిన రచ్చ చెబుతుంది. అయితే.. తాను ముందుగానే రిషిని మరో సేఫ్ ప్లేస్ లో దాచి ఉంచానని చెబుతుంది. అదెక్కడ అని మహేంద్ర అడిగితే.. ఇప్పుడు చెప్పలేను అంటుంది.  

PREV
19
Guppedantha Manasu 15th January Episode:రిషి చనిపోయాడంటూ కాలేజీలో అల్లర్లు సృష్టించిన శైలేంద్ర, వసుకి షాక్
Guppedantha Manasu

Guppedantha Manasu 15th January Episode: రిషి గురించి ఆచూకీ తెలుసుకోవడానికి ఈ సారి శైలేంద్రే స్వయంగా రంగంలోకి దిగుతాడు . చక్రపాణి ఇంటికి వెళతాడు. అక్కడ వసుధార అడ్డుపడుతుంది. అవసరం అయితే.. వసుని చంపేసి ఆ తర్వాత రిషిని చంపేస్తాను అంటూ గదిలోకి వెళతాడు. వసు అడ్డుపడటంతో ఆమెను నెట్టేసి మరీ లోపలికి వెళ్లి చూస్తాడు. కానీ రిషి అక్కడ ఉండడు. అది చూసి శైలేంద్ర షాకౌతాడు. లేడేంటి..? ఎక్కడికి వెళ్లాడు అనిన అడుగుతాడు.  సర్ లేరు అని వసు అంటుంది. మరో రూమ్ లో ఉండి ఉంటాడు అని.. వసు అడ్డుపడుతున్నా నెట్టేసి మరీ వెళ్లి వెతుకుతాడు. అక్కడ కూడా రిషి ఉండకపోవడంతో శైలేంద్రకు కోపం వస్తుంది.. వసు మాత్రం హాయిగా నవ్వుకుంటుంది.

29
Guppedantha Manasu

ఎక్కడ దాచి పెట్టావ్ అని మళ్లీ అడుగుతాడు... తర్వాత మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. తనకు తెలీదని వసుధార అంటుంది. అయితే.. మీ నాన్న, రిషిని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో ఎలా తెలుసుకోవాలో తనకు తెలుసు అని శైలేంద్ర అంటాడు. తన దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి అని అంటాడు.   వాడిని నువ్వు ఎక్కడ దాచినా.. వాడిని లేపేయడం ఖాయమని, ఆ తర్వాత ఎండీ సీటులో కూర్చోవడం కూడా ఖాయం అని శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. కానీ.. ఏమీ చేయలేక శైలేంద్ర వెళ్లిపోతాడు.


 

39
Guppedantha Manasu

నువ్వు వస్తావని నాకు తెలుసు శైలేంద్ర.. అందుకే సర్ ని ఎక్కడ దాచి పెట్టాలో అక్కడే దాచిపెట్టాను అని వసుధార మనసులో అనుకొని నవ్వుతుంది. తర్వాత... మహేంద్ర ఫోన్ చేస్తే... వసుధార లిఫ్ట్ చేస్తుంది. ఏం జరిగింది అంటే.... ధరణి చెప్పిన విషయం మహేంద్ర చెబుతాడు. ఆ తర్వాత.. వసుధార... శైలేంద్ర ఇక్కడకు వచ్చిన రచ్చ చెబుతుంది. అయితే.. తాను ముందుగానే రిషిని మరో సేఫ్ ప్లేస్ లో దాచి ఉంచానని చెబుతుంది. అదెక్కడ అని మహేంద్ర అడిగితే.. ఇప్పుడు చెప్పలేను అంటుంది.

49
Guppedantha Manasu

అయితే.. తన కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మహేంద్ర చాలా బాధపడతాడు. అనారోగ్యంతో ఉన్న తన కొడుక్కి తాను రక్షణ గా ఉండాల్సిందిపోయి,... భయంతో అటూ, ఇటూ తిప్పాల్సి వచ్చిందని మహేంద్ర బాధపడతాడు. జగతి చనిపోయిన తర్వాత నేను బతికి ఉంది కేవలం రిషి కోసమే అని మహేంద్ర అంటాడు. అయితే మహేంద్ర బాధ చూసి పక్కనే ఉన్న అనుపమ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

59
Guppedantha Manasu

రిషికి ఏమీ కాదని అంటుంది..‘ ఏమీ కాకపోవడం కాదు.. కనీసం వాడికి సంతోషం లేదు. నొప్పులతో బాధపడుతున్నాడు. నవ్వలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. కనీసం లేచి నడవలేకపోతున్నాడు’ అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.. అప్పుడు ఫోన్ లో వసుధార ధైర్యం చెబుతుంది. రిషి సర్ త్వరలోనే కోలుకుంటారని, మనమంతా మళ్లీ సంతోషంగా  ఉంటామని చెబుతుంది.

69
Guppedantha Manasu

తెల్లారితే..... రిషిని మళ్లీ వసు... ఆ పెద్దాయన వాళ్ల ఇంటికి తీసుకువస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. మళ్లీ ఇక్కడికి ఎందుకు అని  చక్రపాణి అడుగుతాడు. ఇక్కడ అయితే.. ఎవరికీ అనుమానం రాదని వసుధార అంటుంది. కానీ.. ఇప్పటికే ఓసారి.. శైలేంద్ర ఇక్కడకు వచ్చి వెళ్లాడు కదా, చుట్టుపక్కల మొత్తం కూడా వెతికాడు కదా.. అని చక్రపాణి తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే ఒకసారి వచ్చాడు కాబట్టి.. మళ్లీ రాడని, సర్ ఇక్కడ ఉన్నారనే అనుమానం రాదు లే అని,  అయినా.. మీరు ఇక్కడే ఉంటారు కదా నాన్న.. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు సర్ ని కాపాడతారు అని వసుధార అంటుంది. తాను ఇక్కడ ఉన్నా లేకపోయినా.. నువ్వే బాగా చూసుకోవాలి అని వసుధార అంటుంది. అయితే...  నా ప్రాణం అడ్డు వేసైనా సరే... అల్లుడి గారిని కాపడతాను అని చక్రపాణి అంటాడు. ఎవరైనా అల్లుడుగారిని తాకాలంటే.. ముందు నన్ను దాటాలి అని  చక్రపాణి కూడా ధైర్యం చెబుతాడు.

ఆ తర్వత.. రిషిని ఇక్కడ ఉంచాల్సి వచ్చినందుకు తనకు చాలా బాధగా ఉందని, కానీ..తప్పట్లేదని  వసు అంటుంది. పెద్దయ్య దగ్గర ఉంటేనే.. సమయానికి చికిత్స అందుతుందని.. ఆరోగ్యంగా ఉంటారని, త్వరగా కోలుకుంటారని, రిషి కోలుకునేంత వరకు.. పూర్తిగా వైద్యం చేస్తారని నమ్ముతుంది. వసు మాటలకు చక్రపాణి సరే అంటాడు.. త్వరలోనే  అల్లుడు గారు కోలుకుంటారని, ఆ నమ్మకం తనకు ఉందని చక్రపాణి అంటాడు. తర్వాత.. కూతురిని కాలేజీకి వెళ్లమని కూడా చెబుతాడు.

79
Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే... కాలేజీలో శైలేంద్ర... ఎండీ సీటు చూస్తూ ఉంటాడు. తనకు ఆ ఎండీ సీటుతో వచ్చే అధికారం, హుందాతనం కావాలని, దాని కోసమే తన తాపత్రయం అని అనుకుంటాడు. కానీ.. ఆ ఎండీ సీటుకు తనకు అందని ద్రాక్షలా మిగిలిపోయిందని ఫీలౌతాడు. ఆ కుర్చీ దక్కించుకోవడానికి తాను ఇప్పటి వరకు చేయని ప్రయత్నం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే... ఓ స్టూడెంట్ వచ్చి శైలేంద్రకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. తర్వాత ఆ స్టూడెంట్... ఏంటి సర్ పిలిచారు అని అడుగుతాడు. దానికి.. శైలేంద్ర.. నువ్వు ఏం చేస్తున్నావ్ అంటే.. చదువుకుంటున్నాను అని ఆ అబ్బాయి చెబుతాడు. చదువుకొని ఏం చేస్తావ్ అంటే.. ఉద్యోగం చేస్తానని, డబ్బులు సంపాదిస్తాను అని చెబుతాడు. అయితే.. ఆ డబ్బులు తాను ఇస్తాను అని.. తన కోసం ఓ పని చేయమని చెబుతాడు. ఏకంగా ఆ స్టూడెంట్ కి ఇష్టమని.. స్పోర్ట్స్ బైక్ కూడా కొనిపెడతానని, డబ్బు కూడా ఇస్తానని, తాను చెప్పిన పని చేయాలి అని అడుగుతాడు.

89
Guppedantha Manasu

ఏం పని అని ఆ స్టూడెంట్ అడిగితే....  రిషి, వసుధారలు కాలేజీకి ఎందుకు రావడం లేదో నీకు తెలుసా అని అడుగుతాడు. రిషి సర్ కనిపించడం లేదని విన్నాను అని ఆ స్టూడెంట్ అంటే... కాదని.. రిషి చనిపోయాడు అని  శైలేంద్ర చెబుతాడు. అది విని స్టూడెంట్ షాకౌతాడు. రిషి చనిపోయాడు అని చెబితే.. స్టూడెంట్స్ పానిక్ అవుతారని చెప్పలేదని.. ఆ బాధతోనే వసుధార కూడా కాలేజీకి రావడం లేదని చెబుతాడు. ఆ స్టూడెంట్ తనకు నమ్మబుద్ది కావడం లేదని అంటాడు. కానీ.. శైలేంద్ర మాత్రం అదే నిజం అని.... ఈ విషయం కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ తెలిసేలా చేయాలి అని చెబుతాడు. ఆ విషయం తెలియజేస్తే.. నీకు కావాల్సిన డబ్బంతా ఇస్తాను  అని చెబుతాడు. దానితోపాటు.. మరో ప్లాన్ కూడా వేసి.. ఆ స్టూడెంట్ ని చేయమని చెప్పి పంపిస్తాడు.

99
Guppedantha Manasu

ఆ స్టూడెంట్.. ఈ విషయం మొత్తం కాలేజీలో అందరికీ చెప్పడం మొదలుపెడతాడు. కొందరికి చెప్పడమే కాదు.. ఏకంగా సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తారు. అందరూ వెళ్లి... మహేంద్ర సర్ ని అడగాలని డిసైడ్ అవుతారు.  తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు శైలేంద్ర ఆనందంగా పాట పాడుతూ ఉంటాడు.  కాలేజీలో స్టూడెంట్స్, టీచర్స్ అంతా కలిసి.. ‘ వీ వాంట్ రిషి సర్’ అంటూ నినాదాలు చేసుకుంటూ.. మహేంద్ర దగ్గరకు వెళతారు. ఏమైందని ఫణీంద్ర అడిగితే...  రిషి సర్ చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయని, మాకు రిషి సర్ కావాలి అంటూ  డిమాండ్ చేస్తారు. అయితే.. మహేంద్ర.. ఇప్పుడు కాదని..  ఇంటర్వెల్ లో రమ్మని చెబుతాడు. అయితే.. వాళ్లు మాత్రం.. అసలు క్లాసులే జరగడం లేదని అంటారు.  స్టూడెంట్స్ మాత్రం.. రిషి సర్ ఎందుకు రావడం లేదు, వసుధార ఎందుకు రావడం లేదు అని అడుగుతారు. టీచర్స్ కూడా... వసుధార ఎండీ అయ్యాక కనీసం మాకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని అంటారు. ఈ కల్లోలం సృష్టించి.. రిషిని బయటకు రప్పించడం లేదంటే.. తానే డైరెక్ట్ గా ఎండీ అవ్వాలని శైలేంద్ర ప్లాన్ వేసాడు. మరి ఏం జరుగుతుందో.. అతని ప్లాన్ ని వసుధార ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.

click me!

Recommended Stories