ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకన్న నటుడు సాయి కిరణ్. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్రగా అందరికి చేరువైన కిరణ్ రీసెంట్ గా రెండో పెళ్ళి చేసుకున్నారు. స్రవంతిలో అనే మరో సీరియల్ ఆర్టిస్ట్ ని ఆయన పెళ్లి చేసుకున్నాడు.
ఇక మరో సీరియల్ జంట కూడా రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్ కూడా తన ప్రియుడు, సీరియల్ నటుడు శివకుమార్ తో చాలా కాలంగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో వీరు పెళ్ళి చేసుకున్నారు. ఇలా చాలామంది సినిమా జంటలు ఈ ఏడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు.