నితిన్‌ సినిమాని కొనేవారు లేరా? `రాబిన్‌హుడ్‌` వాయిదాకి అసలు కారణం ఇదేనా?

First Published | Dec 17, 2024, 1:38 PM IST

నితిన్‌, శ్రీలీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న `రాబిన్‌ హుడ్‌` మూవీ వాయిదా పడింది. ఈ పోస్ట్ పోన్‌ కి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

నితిన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `రాబిన్‌హుడ్‌`. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. `భీష్మ` తర్వాత నితిన్‌కి సక్సెస్‌ లేదు. ఈ క్రమంలో మరోసారి హిట్‌ కొట్టాలని, మళ్లీ కమ్‌ బ్యాక్‌ కావాలని నితిన్‌ ప్రయత్నిస్తున్నారు. 
 

ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఈనెల 25న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా టీమ్‌ వెనక్కి తగ్గింది. సినిమాని వాయిదా వేస్తున్నట్టు టీమ్‌ వెల్లడించింది. అనుకోని కారణాలతో సినిమాలను వాయిదా వేశామని టీమ్‌ తెలిపింది. కొత్త రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే వెల్లడిస్తామని, లేట్‌ గా వచ్చిన మంచి కంటెంట్‌తో ఆడియెన్స్ ని సర్‌ ప్రైజ్‌ చేస్తామని తెలిపారు. 
 

Tap to resize

`రాబిన్‌హుడ్‌` సినిమా వాయిదాకి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాల పోటీ ఉండటం, `పుష్ప 2` ప్రభావం ఉండటంతో వాయిదా వేశారని అంటున్నారు. పోటీ మధ్య రిలీజ్‌ ఎందుకు అని వెనక్కి తగ్గారట. అయితే సంక్రాంతికి కూడా రావాలని కూడా అనుకున్నారట. కానీ అందులోనూ వెనక్కి తగ్గారు. సంక్రాంతికి ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. దీంతో అక్కడ కూడా పెద్ద పోటీ ఉంటుందని, దీంతో శివరాత్రికి వెళ్లిన్టు సమాచారం. 
 

అయితే ఈ మూవీ వెనక్కి తగ్గడానికి మరో కారణం కూడా ఉందట. సినిమా బిజినెస్‌ కాలేదని అంటున్నారు. ప్రధానంగా ఓటీటీ బిజినెస్‌ కాలేదని తెలుస్తుంది. ఈ మూవీని సుమారు రూ.70కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. నితిన్‌పై ఇది చాలా ఎక్కువ బడ్జెట్‌ అనే చెప్పాలి. ఇటీవల ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆడలేదు. అయినా ఈ రేంజ్‌లో బడ్జెట్‌ అంటే చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ డబుల్‌ గా పెట్టారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో బిజినెస్‌ కావడం లేదు. థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా ఆశాజనకంగా లేదట.
 

 మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా నిర్మాతలు ఆశించిన రేట్‌కి కొనేందుకు రావడం లేదట. దీంతో రిలీజ్‌ నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం. రిలీజ్‌కి సంబంధించిన నితిన్‌ ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గారని సమాచారం. మినిమమ్‌ బిజినెస్‌ కాకుండా రిలీజ్‌ చేస్తే రిస్క్ లో పడతామని భావించిన నిర్మాతలు మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని టాక్‌. 
 

Latest Videos

click me!