తెలుగు సినిమాలు ప్రస్తుతం ఏస్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయో తెలిసిందే. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, సుజీత వంటి దర్శకులు ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో తమిళ హీరోలు కూడా తెలుగు దర్శకులతో అలాగే, తెలుగు ప్రొడక్షన్ హౌజ్ ల్లో పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ దళపతి ఇక్కడ డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళ, మలయాళ సినిమాలు కూడా తెలుగు వెర్షన్ లో విడుదలవుతూ వస్తున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రెండ్రోజులుగా తమిళ ఆడియెన్స్ కు, మన తెలుగు ఆడియెన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. తెలుగు ఆడియెన్స్ అంటేనే తమిళ స్టార్స్ కు చాలా ఇష్టమని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్ దళపతి, సూర్య, కార్తీ వంటి వారు తెలుగు ఆడియెన్స్ ను ప్రశంసించే వీడయోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. పలువురు డైరెక్ట్ గా తమిళ ఆడియెన్స్ ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.
అయితే... తమిళ ఆడియెన్స్ కేవలం కోలీవుడ్ స్టార్స్ నే సపోర్ట్ చేస్తున్నారని, మన తెలుగు ఆడియెన్స్ ను లేదనే కోణంలో కోల్డ్ వార్ సాగుతున్నదని అర్థమవుతోంది. తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంటూ తమిళ తంబీలు మాత్రం తగ్గింపుగా చూస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఇక ఇటీవల సంక్రాంతికి తెలుగు సినిమాల రద్దీ ఉండటం.... అటు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కు పెట్టుకోవడం... ఇక్కడ థియేటర్లు ఇవ్వకపోవడం తదితర అంశాల ఇప్పటికే చర్చలో ఉన్నాయి. ఇలోగా ఆడియెన్స్ వార్స్ మొదలైంది. ఇక దీనికి ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.