వీళ్ళ పైత్యం పాడుగాను... ప్రేమలు, పెళ్లిళ్లు, ఏడుపులు, ఎమోషన్స్ ఐపోయాయి అరెస్ట్ లు కొత్త ట్రెండ్!

Published : Jun 08, 2022, 06:56 PM IST

కొత్త వింత పాత రోత... చేసిందే చేస్తే జనాలకు ఆసక్తి బదులు అసహ్యం కలుగుతుంది. ఇది ఆ బుల్లితెర షోల డైరెక్టర్స్   ఎప్పటికి తెలుస్తుందో అర్థం కావడం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి కలిగించాలి, టీఆర్పీ పెంచుకోవాలనే క్రమంలో వీరి పైత్యం శృతి మించిపోయింది.

PREV
15
వీళ్ళ పైత్యం పాడుగాను... ప్రేమలు, పెళ్లిళ్లు, ఏడుపులు, ఎమోషన్స్ ఐపోయాయి అరెస్ట్ లు కొత్త ట్రెండ్!
Television shows

జబర్దస్త్ (Jabardasth), ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ, డాన్స్ రియాలిటీ షోల తాలూకు ప్రోమోలు చూస్తే వెగటు పుడుతుంది. సెన్సేషన్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. పాప్యులర్ టీవీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, ఎమోషన్స్ పై ప్రోమోలు కట్ చేస్తూ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. 
 

25
Television shows

ఒకప్పుడు పెళ్లిళ్లు, ప్రేమలు, ఎమోషన్స్, ఏడుపులపై ప్రోమోలు కట్ చేసేవారు. అది రొటీన్ అయిపోయిందని ఏకంగా నేరాలు, అరెస్ట్ లకు తెరలేపారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. హద్దులు దాటిపోయింది. అసలు జనాలు పిచ్చోళ్ళు మనం ఏం చెప్పినా  నమ్మేస్తారనే స్థాయిలో ఆ ప్రోమో ఉంది. 
 

35
Television shows

ప్రోమో ప్రకారం హైపర్ ఆది (hyper Aadi) ఓ ఆక్సిడెంట్ చేశాడు. కారుతో ఓ వ్యక్తిని గుద్దాడు. ప్రమాదానికి గురైన వ్యక్తి చావుబతుల్లో ఉండగా... పోలీసులు అరెస్ట్ చేశారు. షో నిర్వాహకులు, మేనేజర్స్ వారిస్తున్నా వినకుండా హైపర్ ఆదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది నిజం అని నమ్మించే ప్రయత్నంలో డైరెక్టర్స్ కనీస లాజిక్ మిస్ అయ్యారు.

45
Television shows

చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోయే ఈ రోజుల్లో హైపర్ ఆది అరెస్ట్ అయితే జనాలకు తెలియలేదా? మీడియా ఆ న్యూస్ కవర్ చేయలేదా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ షూటింగ్ జరిగి, దాని ప్రోమో బయటికి వచ్చే వరకు ఎవరికీ సమాచారం లేదా? హైపర్ ఆది ఊరూ పేరూ తెలియని అనామకుడు కాదు కదా.. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఇదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. జనాలు మీకు అంత వెర్రిపప్ప ల్లా కనిపిస్తున్నారా? అంటూ సెటైర్స్ వేస్తున్నారు. 
 

55
Television shows

నిజానికి బుల్లితెర షోల ప్రోమోలు నమ్మడం జనాలు ఎప్పుడో మానేశారు. ప్రోమో చూసిన వెంటనే అంతా ఉత్తితే అంటూ క్రింద కామెంట్స్ పెడుతున్నారు . అయినా ఈ పాత చింతకాయ ఫార్ములాను సదరు షోల డైరెక్టర్స్ వదలడం లేదు. పనికి మాలిన ప్రయోగాలతో అబాసుపాలవుతున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories