విఘ్నేష్‌ కోసం నయనతార భారీ గిఫ్ట్.. నయన్‌ కోసం విక్కీ ఖరీదైన ఉంగరం.. పెళ్లి తర్వాత ఉండేదక్కడే?

Published : Jun 08, 2022, 05:19 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార.. ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకుంటుంది. దర్శకుడు విఘ్నేస్‌తో మరికొన్ని గంటల్లో ఏడడుగులు వేయబోతుంది. వీరిద్దరి మ్యారేజ్‌ గిఫ్ట్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయనే వార్త వైరల్‌ అవుతున్నాయి. 

PREV
15
విఘ్నేష్‌ కోసం నయనతార భారీ గిఫ్ట్.. నయన్‌ కోసం విక్కీ ఖరీదైన ఉంగరం.. పెళ్లి తర్వాత ఉండేదక్కడే?

నయనతార(Nayanathara), విఘ్నేష్‌ శివన్‌(Vignesh Shivan) రేపు గురువారం(జూన్‌ 9న) మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగనుంది. నయనతార క్రిస్టియన్‌ కావడంతో క్రిస్టియన్‌ పద్ధతిలో, విఘ్నేష్‌ శివన్‌ హిందూ కావడంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరగబోతుందని తెలుస్తుంది. తాజాగా సోషల్‌ మీడియాలో నయన్‌, విక్కీ(విఘ్నేష్‌) మ్యారేజ్‌(Nayan Wikky Wedding) ఇన్విటేషన్‌ వైరల్‌ అవుతుంది. 
 

25

ఇటీవల కాలంలో ఇంత ఓపెన్‌గా వెడ్డింగ్‌ కార్డ్ ని పంచుకున్నది ఎవరూ లేరు. అంతా సీక్రెట్‌గా మ్యారేజ్‌ జరుగుతూ వచ్చాయి. మ్యారేజ్‌ అయ్యాక ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ నయనతార సీక్రెట్‌గా ప్రేమించినా, పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకుంటుంది. సినీ సెలబ్రిటీలు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. రేపు మహాభలిపురంలోని షేరాటన్‌ గ్రాండ్‌తో వీరి వివాహం జరగబోతుంది. ఉదయం 8.30గంటల నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. వీరి పెళ్లికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరు కాబోతున్నారు, అలాగే సినీ సెలబ్రిటీలు కూడా భారీగానే అటెండ్‌ కానున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా డ్రెస్‌ కోడ్‌ కూడా ఉంటుందని ఇన్వెటేషన్‌ కార్డ్ లో వెల్లడించారు.

35

ఇదిలా ఉంటే మ్యారేజ్‌ సందర్భంగా ప్రియుడు విఘ్నేష్‌కి నయనతార భారీ గిఫ్ట్ ఇవ్వబోతుందట. ఓ ఇంటిని ఆమె బహుమతిగా కాబోయే వాడికి ఇవ్వనుందని ఓ వార్త వైరల్‌ అవుతుంది. సకల సౌకర్యాలతో, లగ్జరీగా నిర్మించిన ఇంటిని భర్త పేరుమీద నయనతార రిజిస్ట్రేషన్‌ చేయించిందని సమాచారం. దీని విలువ ఏకంగా రూ.20కోట్లు ఉంటుందని సమాచారం. మ్యారేజ్‌ అయ్యాక ఈ ఇద్దరు ఈ ఇంట్లోనే ఉండబోతున్నట్టు సమాచారం. 

45

ఇక ప్రియురాలు, కాబోయే భార్య నయనతార కోసం విఘ్నేష్‌ కూడా భారీగానే ప్లాన్‌ చేశారట. తనకిష్టమైన నగలను గిఫ్ట్ గా ఇవ్వనున్నారట. ఈ మేరకు ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా ఓ ఖరీదైన ఉంగరం కూడా ఉందని టాక్‌. ఇలా ఒకరికొకరు కళ్లు చెదిరే కానుకలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 
 

55

ఇదిలా ఉంటే మ్యారేజ్‌ తర్వాత నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందనే వార్త వైరల్‌ అవుతుంది.ఆమె పూర్తిగా ఫ్యామిలీ జీవితానికి పరిమితం కావాలని, మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్టు టాక్‌. అందుకే ఇటీవల కొత్తగా నయనతార మరే సినిమాకి సైన్‌ చేయలేదని, స్క్రిప్ట్ లు కూడా వినడం లేదంటున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలనే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలనుకున్నారట. మరి పూర్తిగా సినిమాలు మానేస్తారా? లేక గ్యాప్‌ ఇచ్చి మళ్లీ నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories