Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య

Published : Mar 07, 2026, 10:27 AM IST

Brahmamudi: పరీక్షకు పంపించాలని స్వాతి తన డ్రెస్ ఇచ్చి కుట్టించుకురావాలని తల్లి ఎదుట ఇందుకు ఆర్డర్ వేస్తుంది. ఎన్నాళ్లకు నా దారిలోకి వచ్చావంటూ భ్రమరాంబ  మురిసిపోతుంది. ఇటు రాజు ల్యాప్ టాప్ అమ్మడానికి వెళ్తూ కారు కింద పడిపోతాడు. తర్వాత ఏం జరిగింది. 

PREV
17
స్వాతి వేసిన ప్లాన్ వర్కవుట్ అయింది

అక్క ఇందును పంపించడానికి స్వాతి వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. కూతురు మాటలకు భ్రమరాంబ పొంగిపోయి...ఒక్కసారిగా ఈ మార్పు ఏంటని అడుగుతుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని స్వాతి అంటుంది.

27
ఇందు కారులో వెళ్లేలా స్వాతి నాటకం

బయటకు వెళ్తే రేఖా ఆంటీ తిడతారు కదా..ఎలా వెళ్లను అని భ్రమరాంబను ఇందు అడుగుతుంది. నా పనులు కూడా నేనే చేసుకోవాలా...ఆ మాత్రం బట్టలు కుట్టించుకు వస్తే ఏం కందిపోవులే అని డ్రామాలో భాగంగా ఇందును నిలదీస్తుంది. ఇక నడుచుకుంటూ వెళ్తే పరీక్షకు లేటవుతుందని తల్లి భ్రమరాంబ చేతనే ఇందు కారులో వెళ్లేలా స్వాతి నాటకం ప్లే చేస్తుంది.

37
కావాలనే ఇందు కారును ఢీకొట్టిన రాజు

కారులో ఇందు ఎగ్జామ్ బయలుదేరుతుంది. ఇంతలో రాజు బైక్ పై వస్తూ ఇందు కారుకు ఎదురుపడతాడు. కావాలనే కారును ఢీకొట్టి రూ.20 వేలు గుంజాలని ట్రై చేస్తాడు. చుట్టుపక్కల వాళ్లు రాగానే గొడవ చేసి డబ్బులు వసూలు చేయాలనుకుంటాడు. ఇందు తెలివిగా కారులో సీసీ కెమెరా ఉంది...పోలీసులకు కంప్లైంట్ చేస్తావని రాజును బెదిరిస్తుంది. కారును ఢీకొట్టి డ్యామేజ్ చేసినందుకు నువ్వే రూ.20 వేలు కట్టాల్సి ఉంటుందని ఇందు అంటుంది.

47
ఇందు బెదిరించడంతో జారుకున్న రాజు

పోలీసులు అనగానే రాజు గాబరాగా ఇక్కడే సెటిల్ చేసుకుందామని, కావాలంటే రూ.10వేలు అయినా ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు ఇందు.. నీ గొడవ కూడా రికార్డు అయిందని, తప్పు చేసి మిమ్మల్ని డబ్బులడుగుతావా అని నిలదీస్తుంది. ఈ అబ్బాయితో పాటు మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తామని ఇందు అనడంతో చుట్టుపక్కల వాళ్లు కంగారు పడి పారిపోతారు. అప్పటికే పరీక్షకు లేటవుతుందని చూసి ఇందు అక్కడినుంచి వెళ్తిపోతుంది. రాజు జారుకుంటాడు. నేను డబ్బులు కొట్టేద్దామంటే...నన్నేబెదిరించి, నా దగ్గర డబ్బులు లాగాలని చూసింది, మామూలు పిల్ల కాదు అంటూ రాజు మనసులో అనుకుంటాడు.

57
ఎగ్జామ్ కు స్లిప్పులతో వచ్చిన ఐశ్వర్య

ఇంతలో ఎగ్జామ్ సెంటర్ కు పరీక్ష రాసేందుకు ఐశ్వర్య వస్తుంది. ముందే స్లిప్పులు రెడీ చేసుకుంటుంది. ఐశ్వర్య ఫ్రెండ్స్ కూడా స్లిప్పులు పెట్టుకుంటారు. దొరికితే డిబార్ అయిపోతాం కదా, అప్పుడు ఇంట్లో తెలిసిపోతుందని కా అని ఫ్రెండ్స్ అంటారు. కావాలంటే దొంగ సర్టిఫికేట్లు కొనేద్దాంలే అని ఐశ్వర్య సలహా ఇస్తుంది. 

67
ఎగ్జామ్ హాల్ లో ఉన్న ఐశ్వర్యను చూసి షాక్ అయిన ఐశ్వర్య

ఇక అదే ఎగ్జామ్ హాల్ లో ఉన్న ఐశ్వర్యను చూసి ఇందుకు గుండె బద్దలైపోతుంది. ఐశ్వర్యకు ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకుంటుంది. చివరకు ఇన్విజిలేటర్ మాస్క్ తీయాలని చెప్పడంతో...ఐశ్వర్యకు కనిపించకుండా పక్కకు తిరిగి ముఖం చూపిస్తుంది ఇందు. ఎగ్జామ్ రాస్తూ స్లిప్పులతో ఇన్విజిలేటర్ కు దొరికిపోతుంది ఐశ్వర్య.

77
ఇందు ఎగ్జామ్ కు వెళ్లినట్లు రేఖకు తెలుస్తుందా?.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇందును చూస్తుంది రేఖా. ఇంటికొచ్చిన ఇందును రేఖ నిలదీస్తుంది. అక్కడ నీకేం పని అడుగుతుంది. బట్టలు కుట్టించడానికి వెళ్లానని చెబుతుంది. టైలర్ కు ఫోన్ చేస్తా...నెంబర్ అడుగుతుంది రేఖ. మరి ఇందు ఎగ్జామ్ కు వెళ్లినట్లు రేఖకు తెలుస్తుందా?. 

Read more Photos on
click me!

Recommended Stories