Telangana Assembly Elections 2023: ఏ హీరో ఏ పార్టీకి మద్దతో తెలుసా?

Published : Nov 30, 2023, 02:07 PM IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు బలమైన ఆయుధం. ఒక దేశ భవిష్యత్ ని నిర్ణయించేది ఓటే. మనం ఎన్నుకునే నాయకుల గుణగణాలు, శక్తి సామర్ధ్యాల మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే హీరోలు ఓటు వేయడం సామాజిక బాధ్యతగా భావిస్తారు.   

PREV
19
 Telangana Assembly Elections 2023: ఏ హీరో ఏ పార్టీకి మద్దతో తెలుసా?
Telangana Assembly Elections 2023

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాగా ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద హీరోలు సందడి చేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్యుల వలె క్యూలో నిలబడ్డారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున, నాని, రవితేజ, రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ తమకు కేటాయించిన పోలింగ్ బూత్స్ కి వెళ్లి ఓటు వేశారు. 
 

29

ఓటు అత్యంత రహస్యమైన విషయం. ఎవరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు. సెలెబ్రిటీలు అయితే అసలు చెప్పరు. ఎందుకంటే తమ అభిప్రాయం ఇతరులను ప్రభావితం చేస్తుంది కాబట్టి. అయితే కొన్ని సమీకరణాల ఆధారంగా ఈ హీరో ఏ పార్టీకి ఓటు వేశారో అంచనా వేయవచ్చు. 

 

39

ఎన్టీఆర్ ఒక అంచనా ప్రకారం బీజీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఆయన ఈ మధ్య బీజేపీ పార్టీకి దగ్గరవుతున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాని ఎన్టీఆర్ కలిసిన విషయం తెలిసిందే.

49

మహేష్ బాబు ఎవరికి ఓటు వేసి ఉండొచ్చు అంటే... మొదటి నుండి ఆయన కాంగ్రెస్ అభిమాని. మహేష్ బాబు తండ్రి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు. కాబట్టి మహేష్ బాబు కాంగ్రెస్ కి ఓటు వేసి ఉండొచ్చు. 

59
Allu Arjun


అల్లు అర్జున్ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన మామగారైన చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ పొలిటికల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇవాళ ఆయన సతీమణి స్నేహారెడ్డి లైట్ పింక్ కలర్ డ్రెస్ లో వచ్చి ఓటు వేశారు. 

69


ప్రభాస్ మొదటి నుండి బీజేపీ సానుభూతిపరుడు. ఆయన పెదనాన్న బీజేపీ నేతగా పదవులు కూడా అలంకరించారు. ప్రభాస్ బీజేపీకి ఓటు వేస్తారని చెప్పొచ్చు. 
 

79
Chiraneevi


రామ్ చరణ్, చిరంజీవి కూడా బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు తెలిపాడు. కూటమిగా కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేసింది. పొలిటికల్ గా తమ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి చిరంజీవి, రామ్ చరణ్ ప్రకటించిన నేపథ్యంలో వారు బీజేపీకి ఓటు వేసి ఉండొచ్చు. 

89
Nagarjuna

నాగార్జున కాంగ్రెస్ సానుభూతిపరుడు. ఆయన తండ్రి గారు నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ అభిమానిగా ఉన్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో నాగార్జునను ఇబ్బంది పెట్టారు. కాబట్టి నాగార్జున, నాగ చైతన్య కాంగ్రెస్ కి ఓటు వేసి ఉండొచ్చు. 
 

99

నాని టీడీపీ అభిమాని. ఒకప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుంది. కాబట్టి హీరో నాని కాంగ్రెస్ కి ఓటు వేసి ఉండొచ్చు. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థుల ఆధారంగా కూడా హీరోల అభిప్రాయాలు మారవచ్చు. కాబట్టి ఫలానా హీరో ఫలానా పార్టీకి ఓటు వేశాడని ఖచ్చితంగా చెప్పలేము...

Read more Photos on
click me!

Recommended Stories