Anasuya : ‘అలాంటి మనుషుల్ని ఎప్పటికీ నమ్మకండి’.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj తాజాగా ఆసక్తికరమైన పోస్ట్ ను పెట్టారు. తన ఫాలోవర్స్ ను సూచిస్తూ పెట్టిన కోట్ వైరల్ గా మారింది.
 

‘జబర్దస్త్’ షోతో అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు తన అందంతో వెండితెరపైనా అడుగుపెట్టింది. 

కొన్నాళ్లుగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి నటిగానే వరుస చిత్రాలు చేస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


ఇక తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ నెట్టింట హాట్ టాపిక్ గ్గానూ మారుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 

ఎప్పుడూ ఏదో అంశాన్ని లేవనెత్తుతూ అనసూయ స్పందిస్తుంటారు. కానీ తాజాగా మాత్రం ఎవరితో సూటిగా తన పోస్టుతో బదులిచ్చినట్టు అర్థమవుతోంది. ఇంతకీ స్టార్ నటి ఏమని పేర్కొన్నారంటే..

‘కుక్కలా విశ్వాసంగా లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. కానీ మనిషిలా లేని కుక్కల్ని మాత్రం నమ్మండి’ అంటూ పేర్కొంది. మనుషులకంటే జంతువులు విశ్వాసంగా ఉంటాయని తెలియజేస్తూ పోస్ట్ పెట్టింది. 

ఏదేమైనా అనసూయా రోజూ ఏదొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే... నెక్ట్స్ అనసూయ ‘పుష్ప 2 ది రూల్’ Pushpa 2 The Rule చిత్రంతో అలరిచనుంది. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. 

Latest Videos

click me!