ప్రముఖ నటి సుధ అంటే టాలీవుడ్ లో ఆమె చేసిన తల్లి పాత్రలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రల్లో కూడా నటించారు. టాలీవుడ్ లో ఆమె సినీ ప్రయాణం తల్లిదండ్రులు చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆమెకి అవకాశం వచ్చింది. ఈ మూవీలో సుధ.. చిరంజీవి వదిన పాత్రలో నటించారు. ఈ చిత్రంతో సుధ జాతకం మారిపోయింది. గ్యాంగ్ లీడర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. రౌడీ అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్, హలో బ్రదర్, ఆమె, సుస్వాగతం, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, అతడు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ లో నటించారు. కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టుల రాకతో నటి సుధకి ఇటీవల అవకాశాలు కాస్త తగ్గాయి.