తెలుగు సినిమాల్లో పనిచేయడం గొప్ప విషయమని తెలిపింది, తన నాన్న తాను తెలుగు సినిమాలు చేయడం, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పనిచేయడం పట్ల ఆయన గర్వంగా ఫీలవుతాడని, నా కూతురు చిరంజీవి, ఎన్టీఆర్‌తో చేసిందని గర్వంగా చెప్పుకుంటాడని, అదే నాకు బెస్ట్ మూమెంట్ అని వెల్లడించింది సమీరా రెడ్డి. ఇప్పటికీ `జై చిరంజీవి` చిత్రంలోని జై జై గణేశా సాంగ్ తన ఇంట్లో మారు మోగుతూనే ఉంటుందని, అలాగే ఎన్టీఆర్‌తో చేసిన సినిమాల పాటలు కూడా ఇంట్లో వింటూనే ఉంటామని చెప్పింది సమీరా రెడ్డి.