తరుణ్, సందీప్, రాజా, రాజేష్.. కనిపించకుండా పోయిన టాలీవుడ్ యంగ్ హీరోలు, ఇప్పుడేం చేస్తున్నారు..?

First Published Jan 2, 2024, 4:07 PM IST

తెలుగు తెరపై ఎంతోమంది ఆర్టిస్ట్ లు  వెలుగు వెలిగారు.. కనుమరుగయ్యారు. మంచి భవిష్యత్తు ఉన్న హీరోలు కూడా  అర్ధాంతరంగా కెరీర్ ను ఆపేయాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో స్వయంకృతాపరాదంతో కెరీర్ ను నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు. టాలీవుడ్ తెరపై సందడి చేసి.. కనుమరుగైన యంగ్ స్టార్స్ ఎవరెవరు చూద్దాం...? 
 

వెండితెరపై నుంచి కనుమరుగైన యంగ్ స్టార్స్ లో  ముందుగా గుర్తుకు వచ్చేది తరుణ్ పేరే. ఎంత ఫాస్ట్ గా స్టార్ డమ్ సంపాదించుకున్నారో.. అంతే ఫాస్ట్ గా తన కెరీర్ ను పతనం వైపు తిప్పుకున్నాడు హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. బెస్ట్ యాక్టర్ గా స్టేట్, నేషనల్ అవార్డ్ ను కూడా సాధించాడు తరుణ్.  2000 లో నువ్వే కావాలి తో హీరోగా తేరంగేట్రం చేసినప్పటి నుంచి అందరినీ ఆకట్టుకున్నాడు. తరుణ్ కు ఎప్పుడు ఉండే ఖచ్చితమైన డిక్షన్ తో తరుణ్ తన కెరీర్ మొదట్లోనే లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సంపాదించాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.
 

వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బంగారులోకం అంటూ.. కుర్ర కారుకు లేని పోని ప్రేమ పాఠాలు చెప్పాడు వరుణ్ సందేశ్. కాలేజ్ డేస్ లో ఎలా ప్రేమించ వచ్చ అని చెప్పి.. చివరకి తల్లి తండ్రుల మాట వినాలి అని మెసేజ్ కూడా ఇచ్చారు. ఈసినిమా సూపర్ రూపర్ హిట్ అవ్వగా.. ఆతరువాత వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. కాని ఈసినిమాలా సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేక పోయాడు. హీరోయిన్ వితిక షేరును పెళ్ళాడాడు.. ఆతరువాత జంటగా బిగ్ బాస్ లో సందడి చేశాడు.. రీసెంట్ గా ఓ రొమాంటిక్ పిక్చర్ చేశాడు వరుణ్ సందేశ్.. సినిమాల్లో పెద్దగా యాక్టీవ్ గా లేడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. 
 

Latest Videos


వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే.. అల్లు శిరీష్ ఎంకదుకోఅడ్రస్ లేకుండా పోయాడు.. అల్లు వారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. శిరీష్ కు కాలం పెద్దగా కలిసి రాలేదు. వరుసగా మీడియం బడ్జెట్ సినిమాలు చేసిన శిరీష్.. చివరిగా ఊర్వశివో.. రాక్షశివో సినిమాలో. 2022 వచ్చిన ఈమూవీతరువాత ఈయంగ్ హీరో ముంబయ్ వెళ్ళిపోయాడని సమాచారం. అక్కడే ఉంటున్నాడట. అప్పుడప్పుడు మెగా ఈవెంట్స్ లో.. ఫ్యామిలీ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తున్నాడు శిరీష్. 

సందీప్ కిషన్.. కూడా పెద్దగా కనిపించడం లేదు స్క్రీన్ మీద. పాపం వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. ప్రయత్నం చేసీ చేసి విసిగిపోయాడు యంగ్ హీరో. అటు తమిళంలో కూడా సినిమాలు చేశాడు సందీప్. నందీప్ కిషన్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అయ్యింది పరిస్థితి. దాంతో పెద్దగా యాక్టీవ్ గా లేకుండు సందీప్. ఫుడ్ బిజినెస్ లో దిగాడని తెలుస్తోంది. 
 

నారా రోహిత్ కూడా అంటే.. చంద్రబాబు వారసుడిగా అటు రాజకీయాలు చూసుకుంటూ.. ఇటు సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు నారా రోహిత్. డిపరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేశాడు. హీరో మెటీరియల్ అనినిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో, సినిమా వర్గాల్లో కిందస్థాయి వ్యక్తులలో కూడా నారారోహిత్ మంచి హీరో అన్న పేరు సంపాదించుకున్నాడు. కాని సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడ.. రోహిత్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడ.. నారా నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. చివరిగా 2018 లో వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు.. ఆతరువాత ప్రతినిధి సినిమాను ప్రకటించారు కాని.. అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. 
 

sumanth ashwin

నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తనయుడు వరుస సినిమాలతో కాస్త ఇమేజ్ సాధించిన హీరో సుమంత్ అశ్వీన్. ఈ హీరోకూడా వరుస ప్లాప్ లు పలుకరించడంతో కనిపించబకుండా పోయాడు. ఈమధ్య వరకూ సినిమాలు చేసిన యంగ్ స్టార్ ఓ సైంటిస్ట్ నుపెళ్ళాడీ ఫారెన్ వెళ్ళిపోయాడని అంటున్నారు. ఇక ఈవీవీవారసత్వం తీసుకుని హీరో అయ్యాడు ఆర్యన్ రాజేశ్. సొంతం లాంటి మంచి మంచి సినిమాలు అందించాడు, కుర్ర హీరోగా మంచి హిట్లు కొట్టిన రాశేష్ కెరీర్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో  ఫామ్ కోల్పోయాడు. నిర్మాతగా కొన్ని సినిమాలు చేసినా.. అవి వర్కౌట్ అవ్వలేదు. దాంతో బిజినెస్ లు చూసుకుంటున్నాడని అంటున్నారు. 

వేణు తొట్టెంపూడి ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడిగా వేణు నైపుణ్యం గురించి తెలుసు మరియు అతను తనదైన ముద్రవేశారు. తెలియని కారణాల వల్ల, 2009 సంవత్సరంలో గోపి గోపిక గోదావరి చిత్రం తర్వాత, అతను లైమ్ లైట్ కు దూరంగా ఉండటానికి ఎంచుకున్నాడు. అతను దమ్ములో మెరిసే అతిధి పాత్రలో కనిపించాడు. కానీ అది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. అటువంటి స్థిరపడిన నటుడు దాదాపు పూర్తిగా ఫేడ్ అవుట్ కావడం ఆశ్చర్యంగా ఉంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు అభిజిత్, సుధాకర్ కోమాకుల.. కాని ఈ ఇద్దరు తారలు ఆతరువాత మంచి సినిమాలు చేయలేకపోయారు. ఇద్దరు హీరోలుగా చేసినిమ సినిమాలన్నీ బాక్సాఫీస్దగ్గర బోల్తా కొడుతై వచ్చాయి. ఇక అభిజిత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అయ్యాడు. ఆతరువాత తానే సినిమాలు వదిలేసి.. ట్రావెలర్ అవతారం ఎత్తాడు. అటు సుధాకర్ కోమాకుల కూడా సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో.. పెళ్ళి చేసుకుని సాఫ్ట్ వేర్ భార్యతో ఫారెన్ లో సెటిల్ అయ్యాడు. 

6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలతో డీసెంట్ అటెన్షన్ సంపాదించిన వ్యక్తి రోహిత్ రెడ్డి. అతను కొన్ని హిట్లను అందించడంలో తన వంతు కృషి చేశాడు. కానీ క్రమంగా వెండితెర నుండి వెలిసిపోయాడు. ఆయన చివరిసారిగా 2007లో నవవసంతంలో కనిపించారు. ఆరువాత రీసెంట్ గా ఏదో చిన్న సినిమాతో ముందుకు వచ్చాడు కాని. అది పెద్దగా జానల్లోకి వెళ్ళలేదు. 

ఆనందం  సినిమాతో హీరో ఆకాశ్ ఎంత పాపుల్ అయ్యాడో తెలిసిందే. ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది ఆకాశ్ కు. కాని ఆనంద్ తన కెరీర్ లో పెద్ద హిట్  అయిన తరువాత ఆకాశ్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ పడలేదు. దాంతో కొన్నిసినిమాల్లో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు మరియు గోరింటాకు చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.ఆతరువాత ఆకాశ్ సినిమాల్లో కనిపించలేదు. ఏం చేస్తున్నాడో తెలియదు. 

ఓ చిన్నదానా తో తెరంగేట్రం చేశాడు హీరో రాజ. ఆనంద్ చిత్రంతో ఒకేసారి రాజాకి ఇండస్ట్రీలో మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత మంచి సినిమాలను ఎంచుకున్నాడు. హీరోగా మంచి ఇమేజ్ వస్తుంది అనుకున్నటైమ్ లో .. ఈ  రేసు నుండి తానే స్వయంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను పాస్టర్ గా మారి.. ప్రవచనాలు చెప్పుకుంటున్నాడు. దేవుని సేవలో తరిస్తున్నాడు. 
 

click me!