షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ః చిరు, వెంకీ, పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చరణ్‌.. టార్గెట్‌ ప్రభాస్‌

First Published Jul 19, 2021, 4:10 PM IST

టాలీవుడ్‌ ఇప్పుడు ఇండియన్‌ సినిమాలోనే అత్యంత బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారిపోయింది. దీంతో స్టార్స్ సైతం రెమ్యూనరేషన్‌ భారీగా పెంచేస్తున్నారు. చిరు, వెంకీ, నాగ్‌, ఎన్టీఆర్‌, చరణ్, బన్నీ, రవితేజ వంటి హీరోల లేటెస్ట్ రెమ్యూనరేషన్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

తెలుగు చిత్ర పరిశ్రమ చూపు ఇప్పుడు అన్ని ఇండియన్ ఇండస్ట్రీల చూపు పడింది. పాన్‌ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. భారీ బడ్జెట్‌ చిత్రాలు వస్తున్నాయి. మార్కెట్‌ కూడా పెరిగింది. దీన్నే క్యాష్‌ చేసుకుంటున్నారు హీరోలు. పారితోషికంలో రాజీపడటం లేదు. మార్కెట్‌ తగ్గటు రెమ్యూనరేషన్‌ అంకెలు పెంచేస్తున్నారు. మరి లేటేస్ట్ గా మన స్టార్‌ హీరోలు అందుకుంటున్న రెమ్యూనరేషన్స్ పై ఓ లుక్కేద్దాం.
undefined
ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక్కో సినిమాకి ఇప్పుడు వంద కోట్లు తీసుకుంటున్నట్టు తెలిసిందే. ఇదే దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌`, `సలార్‌` చిత్రాలకు ఆయన వందకోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. దీంతో మిగిలిన హీరోలు కూడా ప్రభాస్‌ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు.
undefined
ఆ తర్వాత మహేష్‌ బాబు ఉన్నారు. `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి యాభై కోట్లు వసూలు చేసిన మహేష్‌ ఇప్పుడు `సర్కారు వారి పాట` కోసం 65కోట్లు తీసుకుంటున్నట్టు టాక్‌.
undefined
మహేష్‌తో పోటీ పడుతున్నారు పవర్‌ స్టార్‌. ఇటీవల `వకీల్‌సాబ్‌`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న `హరిహరవీరమల్లు`, `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లకు కోసం 50-60 కోట్లు తీసుకుంటున్నారని టాక్‌.
undefined
వీరి తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఉన్నారు. `ఖైదీ నెంబర్‌ 150`తో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని, తాను బాక్సాఫీసుకి కూడా మెగాస్టారే అని నిరూపించారు. దీంతో ప్రస్తుతం `ఆచార్య`కిగానూ ఆయనకు యాభై కోట్లు రెమ్యూనరేషన్‌గా ఇస్తున్నారట రామ్‌చరణ్‌. అయితే సొంత బ్యానర్‌ కావడంతో ఏరియా వైజ్‌ కలెక్షన్లు తీసుకోబోతున్నారని టాక్‌.
undefined
ఆ తర్వాత ఐకాన్‌ స్టార్‌ రేసులో ఉన్నారు. `అల వైకుంఠపురములో` చిత్రానికి 20-25 మధ్యలోనే పారితోషికం అందుకున్న బన్నీ..ఇప్పుడు `పుష్ప` కోసం రూ.35కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఇది రెండు పార్ట్ లుగా రావడంతో పారితోషికం కూడా పెంచేశారట. మొత్తం ఆయన ఈ చిత్రానికి సుమారు యాభై కోట్ల వరకు వసూలు చేస్తున్నారని భోగట్టా.
undefined
వీరి తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఉన్నారు. వీరిద్దరికి ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`కిగానూ రూ.35కోట్లు ఇస్తున్నారట. ఈ సినిమాతో వీరిద్దరు యాభై కోట్ల రెమ్యూనరేషన్‌ రేంజ్‌ హీరోలుగా మారబోతున్నారు. అవసరమైతే అది మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
undefined
రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా తన రేంజ్‌ పెంచేశాడు. `లైగర్‌` చిత్రం కోసం ఆయన ఏకంగా ముప్పై కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. వీరంతా డైరెక్ట్ పారితోషికం సగమైతే, మరోసగం కలెక్షన్లలో షేర్‌ రూపంలో అందుకుంటున్నారటని సమాచారం.
undefined
మిగిలిన హీరోలంతా ఇరవై కోట్లు లోపే ఉన్నారు. సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున ఇంకా ఐదు కోట్ల వద్దే ఆగిపోయారు. యంగ్‌ హీరోలతో పోటీ పడలేకపోతున్నారు.
undefined
మరో సీనియర్‌ హీరో బాలకృష్ణ `అఖండ` చిత్రానికి రూ.12కోట్లు తీసుకుంటున్నారట.
undefined
ఇటీవల `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం రూ. 15కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట.
undefined
`ఇస్మార్ట్ శంకర్‌`తో సత్తా చాటిన రామ్‌ ప్రస్తుతం 13కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగ్వల్‌ చిత్రానికి ఈ మొత్తం అందుకోబోతున్నారట.
undefined
నాని ప్రస్తుతం 12కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
undefined
నాగచైతన్య 8 కోట్లు అందుకుంటున్నట్టు టాక్‌.
undefined
మిగిలిన హీరోలు గోపీచంద్‌, నితిన్‌, రానా, మంచు విష్ణు, సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నాగశౌర్య, అల్లరి నరేష్‌, సందీప్‌ కిషన్‌, అఖిల్‌, కళ్యాణ్‌ రామ్‌ వంటి హీరోలందరూ ఐదు కోట్ల లోపే తీసుకుంటున్నారని తాజాగా టాలీవుడ్‌లో సర్కిల్‌ అవుతున్న న్యూస్‌.
undefined
click me!