బిగ్ బాస్ 5: కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాప్ యాంకర్.. సోషల్ మీడియా పోస్ట్ తో క్లారిటీ!

First Published Jul 19, 2021, 1:05 PM IST

ఎటువంటి ప్రకటన లేకుండానే బిగ్ బాస్ సీజన్ 5 హీట్ మొదలైపోయింది. ప్రేక్షకులలో దీనిపై చర్చ జరుగుతుండగా, కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ అనేక పేర్లు తెరపైకి వచ్చాయి.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీజన్ 5 ఆలస్యం కావడం జరిగింది. సెప్టెంబర్ మొదటివారం నుండి షో ప్రసారం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనితో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలిపోయినట్లు తెలుస్తుంది.
undefined
ఇక సోషల్ మీడియా సెలబ్రిటీలు, బుల్లితెర స్టార్స్ కొందరి పేర్లు తెరపైకి రావడం జరిగింది. సింగర్ మంగ్లీ, యూట్యూబర్ షణ్ముఖ్, టిక్ టాక్ దుర్గారావ్, సురేఖా వాణి, నటి నవ్య స్వామి ఇలా కొన్ని పేర్లు ప్రచారం అవుతున్నాయి.
undefined
అలాగే బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న యాంకర్ రవి పాల్గొనబోతున్నట్లు ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారం. అయితే గత రెండు సీజన్స్ నుండి యాంకర్ రవి పాల్గొంటున్నారని ప్రచారం కావడం, చివర్లో అది నిరాశగా మిగలడం జరుగుతుంది.
undefined
సీజన్ 5కి కూడా మునుపటి మాదిరి యాంకర్ రవి పాల్గొంటున్నారు అంటూ  కథనాలు వెలువడుతున్నాయి. కాగా దీనిపై స్వయంగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు యాంకర్ రవి.
undefined
ఓ అభిమాని ఇంస్టాగ్రామ్ లో 'అన్నా బిగ్ బాస్ 5లో పాల్గొంటున్నావట కదా..' అంటూ కామెంట్ పెట్టాడు . ఆ కామెంట్ కి రవి రిప్లై ఇచ్చాడు. 'ఏమో మరి... అంట'  అంటూ కామెంట్ చేస్తాడు.  బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది లేని చెప్పకున్నప్పటికీ.. అవకాశం వస్తే రెడీ అన్నట్లు రవి కామెంట్ ఉంది.
undefined
రెమ్యూనరేషన్ కుదిరితే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి రవి సిద్ధంగా ఉన్ననట్లు పరోక్షంగా ఆయన కామెంట్ ద్వారా తెలుస్తుంది.
undefined
ఇంస్టాగ్రామ్ లో ఆయన అభిమానులు మీరు బిగ్ బాస్ హౌస్ కి రావాలన్నా, అంటూ కోరుకుంటున్నారు. మరి అభిమానులు కూడా ఇంతగా ఆశపడుతుంటే రవి ఈ సారైనా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
undefined
మరోవైపు సీజన్ 5 హోస్ట్ విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. నాగార్జున ఈసారి చేయనంటూ తప్పుకున్నారని, నిర్వాహకులు రానాతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు రావడం జరిగింది. రానా కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని మరో కథనం.
undefined
click me!