
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం వరుసగా టాస్క్ లతో సాగుతోంది. హోరా హొరీ టాస్క్ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న వారు, దాన్నుంచి సేఫ్ అయ్యేందుకు టాస్క్ లు ఇస్తున్నారు బిగ్ బాస్. అందులో భాగంగా ఈ వారం నామినేషన్లకి సంబంధించిన ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్ సేఫ్‌లో ఉన్నారు. మిగిలిన అంతా నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వారిలో అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. వారు సేవ్ అయ్యేందుకు వరుసగా టాస్క్ లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక గురువారం(32) ఎపిసోడ్ పలు ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రెండు టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.
ప్రారంభంలో రీతూ చౌదరీ, సంజనా గల్రానీ ఇద్దరు కవలలు మాదిరిగా ప్రవర్తించారు. చాలా స్లోగా నడుస్తూ ఎంటర్‌టైన్ చేశారు. అయితే వీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్న నేపథ్యంలో వాళ్లని అందులోకి పంపించేందుకు కెప్టెన్ రాము ఒక స్ట్రాటజీ వాడారు. ఎగ్ ఆశ చూపించి, బెదిరించి వారిని బయటకు పంపించారు. అనంతరం బిగ్ బాస్ బ్రిడ్జ్ లోపలి నుంచి బయటకు వచ్చే టాస్క్ ఇచ్చారు. ఏ టీమ్‌లోని వ్యక్తి మొదటగా బయటకు వస్తారో వాళ్లు విన్నర్. ఇందులో కళ్యాణ్-తనూజ జంటగా మొదటగా వచ్చారు. ఆ తర్వాత భరణి-దివ్య జంట వచ్చింది. అనంతరం డీమాన్ పవన్-రీతూ జంట రాగా, చివరగా సుమన్ శెట్టి, శ్రీజ వచ్చారు. ఈ టాస్క్ లో సంజనా- ఫ్లోరా జంట ఓడిపోయింది.
దీంతో డాష్ బోర్డ్ లో అత్యధిక పాయింట్లతో భరణి-దివ్య సేఫ్ అయ్యేందుకు మొదటగా ఉన్నారు. అయితే ఇందులో చివరి స్థానంలో సంజనా, ఫ్లోరాతోపాటు సుమన్ శెట్టి-శ్రీజ జంటలున్నారు. ఈ రెండు జంటల్లో ఒకరిని తొలగించాలని బిగ్ బాస్.. భరణి-దివ్యలకు అధికారం ఇచ్చారు. వీరిద్దరు సంజనా, ఫ్లోరాలను గేమ్ నుంచి తప్పించారు. అనంతరం పిరమిడ్ కట్టే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇది గ్లాసెస్‌ని ఏకాగ్రతతో పిరమిడ్‌లా పేర్చే టాస్క్. ఈ టాస్క్ లో కళ్యాణ్-తనూజ మొదట విన్ అయ్యారు. ఆ తర్వాత భరణి-దివ్య చేశారు. సుమన్ శెట్టి, శ్రీజ చేశారు. చివరగా రీతూ, పవన్ చేశారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన పాయింట్ల ఆధారంగా భరణి, దివ్యలు అత్యధిక పాయింట్లు దక్కించుకుని సేవ్ అయ్యారు. వాళ్లు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్లారు. అనంతరం తనూజ, కళ్యాణ్‌లకు కూడా అవకాశం ఒక కల్పించారు బిగ్ బాస్. కాకపోతే ఇద్దరిలో ఒక్కరే వెళ్లాలి. తనూజ త్యాగం చేయడంతో కళ్యాణ్ సేఫ్ జోన్‌లోకి వెళ్లాడు.
ఇదిలా ఉంటే వరుసగా టాస్క్ లు ఓడిపోతున్న నేపథ్యంలో సంజనా కన్నీళ్లు పెట్టుకుంది. తన వల్ల అవడం లేదని వాపోయింది. ఫిజికల్ టాస్క్ లు తమ వల్ల కాదని తెలిపింది. మైండ్‌తో చేసే టాస్క్ లు ఆడదాతమని చెప్పింది. ఇలా అబ్బాయిలతో రాసుకుని పూసుకుని గేమ్ లు ఆడటం తమ వల్ల కాదని, ఇలాంటివి ఉంటాయని అస్సలు అనుకోలేదని, తెలిస్తే అసలు బిగ్ బాస్ షోకే వచ్చేదాన్ని కాదని ఆమె వాపోయింది. తనకు హౌజ్‌లో ఉండాలని లేదని, పంపించేయండి అంటూ వాపోయింది. ఉండను, వెళ్ళిపోతా, పంపించేయండి అంటూనే తాను ఆడుతా, పోరాడుతా అని చెప్పడం గమనార్హం.
మరోవైపు భరణి విషయంలో తనూజ ఫైర్ అయ్యింది. అంతకు ముందు తనూజ, భరణి క్లోజ్‌గా ఉండేవాళ్లు. తనూజని కూతురుగా భావించేవారు భరణి. ఇద్దరి మధ్య ఆ బాండింగ్ బలపడింది. కానీ ఆ తర్వాత దివ్య వచ్చాక ఆమెతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు. ఆమెని కూతురుగా భావిస్తున్నారు. దీంతో తనూజ తట్టుకోలేకపోతోంది. ఏంటో దివ్య వచ్చాక భరణి చాలా మారిపోయారని తనూజ, అలాగే సంజనా కూడా అభిప్రాయపడింది. ఈ విషయంలో తనూజ ఎక్కువగా ఫీల్ అవుతోంది. అసూయ చెందుతోంది. తననేమో కూతురు అంటున్నాడు, మిస్ అవుతున్నా అంటున్నారు. కానీ ఆమెతోనే ఎక్కువగా ఉంటున్నాడు, ఆమె కోసమే గేమ్ ఆడుతున్నాడని చెప్పి తనూజ వాపోయింది. దీంతో వీరి బాండింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గురువారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిందని చెప్పొచ్చు. అయితే ఇందులో డాన్సులు వేసే టైమ్‌లో సుమన్ శెట్టి తనదైన స్టెప్పులతో ఇరగదీశాడు. అంతా ఆయన డాన్సుని ప్రశంసించడం విశేషం.