Director Teja: ఆ నిర్మాత వల్లే నా కొడుకు చనిపోయాడు.. గుండె చలించే విషయం బయటపెట్టిన దర్శకుడు తేజ

Published : Oct 09, 2025, 07:06 PM IST

Director Teja: దర్శకుడు తేజ తన చిన్న కొడుకు మరణానికి సంబంధించిన ఒక షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. ఓ నిర్మాత కారణంగానే తన కొడుకు మరణించాడని తేల్చి చెప్పాడు తేజ. 

PREV
15
ఆ హీరోలకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తేజ

దర్శకుడు తేజ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ రూపొందించి విజయాలు అందుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌, నితిన్‌ వంటి వారికి కెరీర్‌ ప్రారంభంలో మంచి లైఫ్‌ ఇచ్చారని చెప్పొచ్చు. `చిత్రం` `నువ్వు నేను`, `జయం` `నిజం`, `జై`, `ఔనన్నా కాదన్నా`, `ధైర్యం`, `ఒక వి చిత్రం`, `లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలతో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఒకప్పుడు తేజ దర్శకత్వంలో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని ఉండేది. కానీ ఇప్పుడు ఆకట్టుకోలేకపోతున్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ ని ఫేస్‌ చేస్తున్నారు. చివరగా ఆయన `అహింస` అనే చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు చిన్నకొడుకు, రానా తమ్ముడు అభిరామ్‌ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించగా, ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఆ తర్వాత తేజ నుంచి మరే మూవీ రాలేదు.

25
కొడుకు మరణం వెనుక సంచలన నిజాలు బయటపెట్టిన తేజ

ఈ క్రమంలో తాజాగా దర్శకుడు తేజకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో తన కొడుకు మరణానికి సంబంధించి ఆయన వెల్లడించిన విషయం షాకిస్తోంది. ఓ నిర్మాత వల్ల తన కొడుకుని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తేజ కొడుకు అరోవ్‌ తేజ చిన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెదడు, శ్వాససంబంధించిన సమస్యలతో చికిత్స పొందుతున్నాడు. కొడుకుని ఎలా కాపాడుకోవాలో తెలియక తేజ సతమతమవుతున్నారు. అలాంటి సమయంలోనే ఓ నిర్మాత వచ్చి తనకు ఇవ్వాల్సిన కోటీ రూపాయల అప్పు తీర్చమని కూర్చున్నాడట.   `నేను సినిమా చేస్తే మీ అప్పు తీర్చేస్తాను, కానీ మా అబ్బాయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అతనికి ట్రీట్‌మెంట్‌ అందించాలి. జర్మనీ తీసుకెళ్లాలి` అని ఆ నిర్మాతకు చెప్పారట దర్శకుడు తేజ. డబ్బుల కోసం తన ఇంటిని ఆ నిర్మాతకే తాకట్టు పెట్టారట. మూడు కోట్లకు ఆ ఇంటిని అగ్రిమెంట్‌ రాయించుకున్నారట.  

35
తేజకి నరకం చూపించిన నిర్మాత

తనకు ఇవ్వాల్సిన కోటి తీసేసుకుని రెండు కోట్ల కొత్తగా అప్పు ఇచ్చేలా ఈ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. డబ్బులు తీసుకొచ్చి టేబుల్‌పై పెట్టి దర్శకుడు తేజ, ఆయన భార్యతో పేపర్స్ పై సైన్‌ చేయించుకున్నారట. సైన్‌ అయిపోయిన వెంటనే నిర్మాత మనుషులకు ఓ ఫోన్‌ వచ్చింది.  ఆ నిర్మాత వచ్చి డైరెక్ట్ గా మీకు డబ్బులు ఇస్తారట సర్‌ అని చెప్పి డబ్బులు తీసుకొని పోయారట వాళ్లు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వలేదు, ఇళ్లుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారట. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారట. ఓ వైపు సినిమాలు లేవు, మరోవైపు కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఇంకోవైపు వీళ్ల టార్చర్‌, ఏం చేయాలో తోచక మెంటల్‌ ఎక్కిపోయిందన్నారు తేజ. ఆయన జోలికి వెళ్లొద్దని కొందరు బెదిరింపులకు కూడా పాల్పడ్డారట. దీంతో చాలా నరకయాతన అనుభవించానని చెప్పారు తేజ. ఇక చేసేదేం లేక మరో ఇంటిని తాకట్టు పెట్టుకుని, కొంత అడ్వాన్స్ తీసుకుని కొడుకుని విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్‌ మెంట్‌ చేయించారట.

45
నిర్మాతల చదలవాడ శ్రీనివాసరావు వల్లే నా కొడుకు చనిపోయాడుః తేజ

ఆ తర్వాత తన అబ్బాయికి సెకండ్ లెవల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటిదే కంటిన్యూ అయ్యిందని, మళ్లీ కేసు పెట్టి తిప్పించారని, దీని కారణంగా సరైన ట్రీట్‌మెంట్‌ ఇప్పించలేక తన కొడుకుని కోల్పోవల్సి వచ్చిందని తెలిపారు దర్శకుడు తేజ. ఏబీఎన్‌ రాధాకృష్ణ `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే` టాక్‌ షోలో తేజ ఈ విషయాలను బయటపెట్టారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, మీకు మొదటిసారి చెబుతున్నానని, తన కొడుకుని కోల్పోవడానికి కారణం ఆ నిర్మాతనే కారణమని తెలిపారు. రాధాకృష్ణ పదే పదే అడగడంతో ఆ నిర్మాత ఎవరో చెప్పాడు తేజ. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావునే ఇదంతా చేశాడని, ఆయన కారణంగానే కొడుకుని కోల్పోయానని స్పష్టం చేశారు. ఆయన ఈ కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఎంతటి నరకం అనుభవించావు తేజ.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని అంటూ తేజకి సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు.

55
కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్న తేజ

ఇదిలా ఉంటే దర్శకుడు తేజకి మరో(పెద్ద) కొడుకు ఉన్నాడు. పేరు అమితవ్‌ తేజ. త్వరలో ఆయన హీరోగా పరిచయం కాబోతున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి `విక్రమాదిత్య` పేరుతో పీరియాడికల్ లవ్‌ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాతో దర్శకుడు తేజ కమ్‌ బ్యాక్‌ కాబోతున్నారని సమాచారం. అయితే ఇందులో అమితవ్‌ తేజకి జోడీగా మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కూతురు హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories