Tanuja Bad Luck : విన్నర్ కప్ తో పాటు.. మరో జాక్ పాట్ ను కూడా మిస్ అయ్యింది తనూజ. బ్యాడ్ లక్ అంటే ఆమెదేనేమో. విన్నర్ ను మించిన డబ్బు చేతికి అందినట్టే అంది చేజారిపోయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్‌లో సామాన్యుడిగా బిగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి టైటిల్ ట్రోఫీని అందుకున్నాడు. ఇక కళ్యాణ్ కు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా నిలవగా, చివరి వరకు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కొనసాగింది. ఎందుకంటే ఒక దశలో తనూజ కళ్యాణ్ ను మించి ఓటింగ్ సాధించింది. దాంతో తొలిసారి బిగ్ బాస్ విన్నర్ గా ఒక మహిళ నిలవబోతోందని అనుకున్నారు అంతా. కానీ కళ్యాణ్ క్రేజ్ ముందు తనూజ నిలబడలేకపోయింది. అంతే కాదు తనూజ నిర్ణయం వల్ల భారీ ప్రైజ్ మనీ కూడా మిస్ అయ్యింది.
25
తనూజను వెంటాడిన బ్యాడ్ లక్..
ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం ఏంటంటే.. రన్నర్ గా నిలిచిన తనూజ బ్యాడ్ లక్. ఆమె రన్నరప్‌గా నిలిచినప్పటికీ, ఆమె విన్నర్ ను మించి సంపాదించే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు. కానీ తాను విన్నర్ అవుతాన్న ఆత్మవిశ్వాసంలో జాక్ పాట్ ను ఆమె మిస్ అయ్యింది. ఈసారి బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుంచి 15 లక్షలు టాప్ 3 కి ఆఫర్ చేశారు. అది అందుకుని తెలివిగా డీమాన్ పవన్ బటకు వచ్చాడు. దాంతో ప్రైజ్ మనీ 35లక్షలు అయ్యింది. ఆతరువాత టాప్ 2 లో వారికి 20 లక్షలు ఆఫర్ చేయగా.. కళ్యాణ్, తనూజ ఇద్దరు రిజెక్ట్ చేశారు. ఒక వేళ తనూజ ఈ 20 లక్షలు తీసుకుని ఉంటే.. ప్రైజ్ మనీలోంచి 20 లక్షలు తనూజకు వచ్చేవి. దాంతో ప్రైజ్ మనీ 15 లక్షలకు తగ్గిపోయేది. విన్నర్ ను మించి తనూజ సంపాదించేది.
35
తనూజ రెమ్యునరేషన్ తో కలిపి..
బిగ్ బాస్ హౌస్ లో 15 వారాలు ఉన్నందుకుగాను తనూజకు వారానికి ర 2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 15 వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె మొత్తం ఆదాయం 42 లక్షలకు పైగా ఉన్నట్టు అంచనా. ఒక వేళ తనూజ బిగ్ బాస్ ఆఫర్ చేసిన 20 లక్షలు తీసుకుని ఉంటే.. ఆమె టోటల్ గా 62 లక్షలకు పైగా తీసుకుని బయటకు వచ్చేది. దానితో పాటు టాప్ 2 లో ఉంది కాబట్టి రన్నర్ టైటిల్ కూడా ఉండేది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల.. 20 లక్షలు పోగోట్టుకుంది. రన్నర్ గా మిగిలిపోయింది తనూజ. కానీ తనకు డబ్బు ముఖ్యం కాదని, టైటిల్ విన్ అయ్యి తీరాలని పట్టుదలతో ఉన్నట్టు తనూజ వెల్లడించడం విశేషం. అంతకు మించి అభిమానులను ఆమె సొంతం చేసుకుంది.
నిజానికి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచే తనూజ టైటిల్ ఫేవరెట్‌గా కొనసాగింది. . హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజునుంచే ఆమె ఆటతీరు, ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాస్కులు అయినా, నామినేషన్లు అయినా, ఎక్కడా తగ్గలేదు. ఇటు ఫైట్ చేస్తూనే.. అటు ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. సీనియల్స్ వల్ల తనూజకు ఎంత మంది అభిమానులు వచ్చారో తెలియదు కానీ.. బిగ్ బాస్ వల్ల చాలా మంది ఆడియన్స్‌కు ఆమె ఫేవరెట్ కంటెస్టెంట్‌గా మారింది.
55
తనూజకు నెగటివ్‌గా మారిన అంశాలు
గేమ్ సాగుతున్న కొద్దీ కొన్ని అంశాలు తనూజకు నెగటివ్‌గా మారాయి. ముఖ్యంగా భరణితో ఆమె బాండింగ్, అవసరం లేని చోట ఎక్కువగా వాదించడం, ఎక్కువగా ఏడవడం, ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపినట్టు సమాచారం. అంతే కాదు కళ్యాణ్ పడాల విషయంలో పాజిటివ్ అంశాలు తనూజకు కలిసిరాలేదు.. కళ్యాణ్ పడాల, తనూజ మధ్య ఏర్పడిన క్లోజ్‌నెస్ కూడా తనూజకు నష్టంగా మారిందనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఈ పరిణామాల మధ్య, ఒక దశలో తనూజ అభిమానులు కూడా కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తనూజకు వచ్చే ఓటింగ్ ప్రభావితమైందని తెలుస్తోంది. చివరకు కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలవగా, తనూజ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ వల్ల బాగా పాపులారిటీ వచ్చింది తనూజకు. మరి అది ఆమె కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనిస్తుందో చూడాలి.