
ఆ జోతిష్కుడు చెప్పిన మాటలను కూడా మనోజ్ నమ్మకుండా డౌట్ పడతాడు. అయితే.. తన మాటలు నమ్మకుంటే.. నీ పరిస్థితి దారుణంగా మారుతుందని..గుడి ముందు అడుక్కోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. మనోజ్ ఆల్రెడీ బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే.. దానిని విప్పమని.. ఓ కండువా ఇచ్చి కప్పుకోమంటాడు. తాను చెప్పిన రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలని మరీమరీ చెబుతాడు. మనోజ్ సరే అంటాడు. ‘ ఈ రంగులు వేసుకుంటే నిజంగానే నా సమస్య తీరిపోతుందా స్వామి’ అని మనోజ్ అడిగితే.. ‘ ఇలా నేను చెప్పినట్లు చేస్తే.. తర్వాత అంతా నీకు అనుకూలంగా ఉంటుంది. నువ్వు ఏమీ చేయకపోయినా నీకు కలిసొస్తుంది. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు కూడా వస్తాడు’ అని అంటాడు. ఆ మాటలకు మనోజ్ సంబరపడిపోతాడు. తర్వాత స్వామిజీకి సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక హాల్లో సత్యం, ప్రభావతి మాట్లాడుకుంటూ ఉండగా.. బాలు వస్తాడు. ఒక హుండీ తీసుకొని వస్తాడు. వస్తూ వస్తూనే మీనాని పిలుస్తాడు. ఆ హుండీ ఎందుకు అని సత్యం, ప్రభావతి అడిగితే... డబ్బులు దాచి దానితో ఇల్లు కడదాం అని అని చెబుతాడు. ‘ చూశావమ్మా నీ మొగుడు రూమ్ కడతాడని శపథం చేశావుగా.. అందుకు నీ మొగుడు హుండీ పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ అడుక్కొని రూమ్ కడతాడు అంట’ అని మీనాని ఉద్దేశించి ప్రభావతి అంటుంది. మీనా మాత్రం అస్సలు ఊరుకోదు. ‘ అత్తయ్య.. కాస్త మామయ్య గారి కళ్ల జోడు అడుక్కొని పెట్టుకోండి.. మీ ఎదురుగా ఉన్నది బాలు.. మనోజ్ కాదు. అడుక్కు తినాల్సిన ఖర్మ నా మొగుడికి లేదు’ అని మీనా బదులిస్తుంది. ‘ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే.. సెంటర్ లో ఇలానే అడుక్కుంటూ ఉంటారు. వీడు కూడా అడుక్కు తినడానికే ఈ హుండీ తెచ్చాడు’ అని ప్రభావతి అనేలోగా.. మనోజ్ నిజంగానే అడుక్కునేవాడిలా అమ్మా అని పిలుస్తూ వస్తాడు. వెంటనే మీనా.. ‘ అత్తయ్య .. ఇందాక మా ఆయనను ఏదో అన్నారు.. ఇప్పుడు అనండి’ అంటుంది. వెనక్కి తిరిగి మనోజ్ ని చూసి ప్రభావతి కూడా షాక్ అవుతుంది. ఏంట్రా ఈ వేషం అని అడుగుతుంది.
‘ అడుక్కునే వాడు అనుకుంది కదరా అమ్మ’ అని బాలు అంటాడు. ఎవర్ని రా అడుక్కునేవాడు అంటున్నావ్ అని మనోజ్ అడిగితే..‘ నిన్నే రా.. అందులో నీకు మాత్రమే అనుభవం ఉంది కదా. ఏ అప్పులోడు నీ చొక్కా చింపి.. ఇలా పంపించాడో చెప్పు రా’ అని బాలు అడిగితే.. ‘ ఇది దీక్ష.. దైవోపాసన’అని మనోజ్ అంటాడు. ఆ కండువా తీయమని ప్రభావతి అంటే.... తప్పు.. అలా తీయకూడదని.. తాను దీక్షలో ఉన్నానని మనోజ్ ఏదేదో చెబుతాడు. తర్వాత దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటాడు. మనోజ్ చేసే పనులు చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. కాసేపు బాలు ఫన్ చేస్తాడు. అయితే... ఆ విషయం పక్కన పెట్టి.. ఆ హుండీ విషయం చెప్పమని సత్యం అడుగుతాడు. దానికి బాలు, మీనా ఇద్దరూ కలిసి‘ రెండు కార్ల మీద వచ్చిన ఆదాయం, పూలు అమ్మగా వచ్చిన ఆదాయం రోజూ కొంత ఇందులో వేస్తాం’ అని చెబుతాడు. ‘ ఏంటి..? ఆ చిల్లర డబ్బులు అందులో వేస్తారా, ఆ డబ్బులతో ఇల్లు కట్టాలంటే 25 సంవత్సరాలు పడుతుంది’ అని ప్రభావతి సెటైర్ వేస్తుంది. కానీ, బాలు పెద్దగా పట్టించుకోడు. తన తండ్రి చెయ్యి మంచిదని.. అతని చేతితో.. హుండీలో మొదట డబ్బులు వేయిస్తాడు.
సరిగ్గా అదే సమయానికి రోహిణీ వస్తుంది. ఆ హుండీ విషయం అడిగితే.. అందులో డబ్బులు దాచి రూమ్ కడతాం అని మీనా చెబుతుంది. ‘ ఇందులో డబ్బులు దాచడం కష్టం కాదు కానీ.. దీనిని దాచడమే కష్టం’ అన్న బాలు మనోజ్ ని చొక్కాలేనోడా అని పిలుస్తాడు. ఆయన ఎందుకండీ అని మీనా అంటే.. ‘ దొంగ చేతికే తాళం ఇస్తే.. దొరికిపోతాననే భయంతో దొంగతనం చేయకుండా ఉంటాడని.. వాడి చేతిలో పెడతాను’ అంటాడు. సత్యం వద్దు అని, మీ గదిలోనే పెట్టుకోమని చెబుతాడు. ‘ మీ ఆయన..మా ఆయన్ని చాలా ఎక్కువ మాటలు అంటున్నాడు’ అని రోహిణీ.. మీనాకి ఫిర్యాదు చేస్తే... ‘ మా ఆయన అలా ఎందుకు అన్నాడో.. గదిలోకి వెళ్లి.. మీ ఆయనను చూడు నీకే తెలుస్తుంది’ అని మీనా బదులిస్తుంది.
రోహిణీ.. తన గదిలోకి వెళ్లి చూసే సరికి.మనోజ్.. చొక్కా లేకుండా.. మంచం మీద కూర్చొంటాడు. ఆ గెటప్ చూసి షాక్ అయన రోహిణీ.. ఏంటీ అవతారం అని అడుగుతుంది. ఇది తనను కాపాడే కవచం అని... ఆ జోతిష్కుడు చెప్పిన విషయం మొత్తం చెబుతాడు. అయితే.. రోహిణీ ఈ పిచ్చి పనులు ఏంటి అని తిడుతుంది.కానీ.. మనోజ్ రోహిణీ మాటలు పట్టించుకోకుండా.. ఏదేదో మాట్లాడతాడు. నీ చావు నువ్వు చావు అని రోహిణీ వదిలేస్తుంది. ఈ లోగా ప్రభావతి వెళ్తుంటే.. ఆమెను మనోజ్ పిలుస్తాడు. ‘ ఏడు రోజులకు ఏడు రంగుల చొక్కాలు కొనుక్కున్నాను’ అని మనోజ్ తన కొత్త షర్ట్స్ చూపిస్తాడు. ఎందుకు ఇవి అని ప్రభావతి అడిగితే మళ్లీ ఆ జోతిష్కుడు చెప్పిందంతా చెబుతాడు. కాసేపు ఇదే విషయంపై చర్చించుకుంటారు. మనోజ్ మాటలకు రోహిణీ, ప్రభావతి తలలు బాదుకుంటారు. మనోజ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని రోహిణీకి చెప్పి.. ప్రభావతి వెళ్లిపోతుంది. ఇక తన దుస్తులు మీనా ఉతకకూడదని.. రోహిణీ మాత్రమే ఉతకాలని చెబుతాడు. ఆ మాటలకు రోహిణీ భయపడుతుంది.
బాలు తన గదిలో ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మీనా వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగితే.. మౌనిక గురించి అని చెబుతాడు. ‘ మౌనిక నుంచి ఫోన్ కూడా రాలేదు.. ఒకసారి వెళ్లి మౌనికను చూసి వస్తాను’ అంటాడు. దానికి మీనా మనసులో ఈయన వెళితే మౌనిక పరిస్థితి తెలిసిపోతుంది అని కంగారు పడి.. బయటకు మాత్రం.. ‘ మౌనిక నాకు ఫోన్ చేసింది. ఎందుకు ఇలా ప్రవర్తించావ్ అని అడిగాను.. చాలా బాధ పడింది. కార్తీక పౌర్ణమి రోజున జరిగిన గొడవ సంజూ ఇంకా మర్చిపోలేదని... సంజూతో మళ్లీ గొడవ ఎందుకు అని అలా ప్రవర్తించాను’ అని చెబుతుంది. అయితే బాలు మళ్లీ ఫోన్ చేస్తాను అని అంటే... మీనా ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.
ఇక.. ప్రభావతిని కలవడానికి ఆమె స్నేహితురాలు వస్తుంది. సత్యం అన్నయ్యతో మాట్లాడేలా చేశావ్ అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు. వాళ్ల నాన్నమ్మ సుశీలమ్మ కారణంగానే కలిసిపోయారని బాలు నిజం చెబుతాడు. నిజం తెలిసి.. ఆమె ప్రభావతిని తిడుతుంది. సత్యం కూడా ఎంట్రీ ఇచ్చి అసలు విషయం చెబుతాడు.
అప్పుడే రవి వచ్చి.. ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఎందుకు అని ఇంట్లో అందరూ అడిగితే.. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ఉందని చెబుతాడు. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఇదే టైమ్ అనుకోని.. మీనా, బాలుని తక్కువ చేసి ప్రభావతి మాట్లాడుతుంది. మనోజ్ కూడా బాలు మీద కౌంటర్ వేయడంతో.. మీనా కొంచెం కూడా తగ్గకుండా.. కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత శ్రుతి.. ఫ్రైజ్ మనీ రూ.లక్ష అనడంతో అందరికీ ఆసక్తి కలుగుతుంది. బాలు,మీనా వద్దు అని వెళ్లిపోయినా.. మనోజ్, రోహిణీ మాత్రం కచ్చితంగా పార్టిసేపట్ చేయాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది.
కపింగ్ ఎపిసోడ్ లో.. ఒకరికి తెలియకుండా మరొకరు అందరూ ఈ కాంపిటేషన్ కి వస్తారు. ఆ విషయాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం...