Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?

Published : Dec 22, 2025, 09:48 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పూర్తయ్యింది. విన్నర్ గా కళ్యాణ్ పడాల గెలిచాడు. సామాన్యుడిగా వెళ్లి విన్నర్ గా తిరిగి వచ్చాడు. అయితే ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. మరి ఆ విన్నర్స్ ఇప్పుడేం చేస్తున్నారు. 

PREV
19
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల

తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్‌లో సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల.. విజేతగా నిలిచి టైటిల్ ట్రోఫీని అందుకున్నాడు. స్టార్ సెలబ్రిటీలతో పోటీ పడి సామాన్యుడు బిగ్ బాస్ తెలుగు కప్ గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జరిగిన బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ల విజేతలు ఎవరు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు.

29
నిఖిల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఈ సీజన్‌లో చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే అందుకు భిన్నంగా నిఖిల్ విజేతగా నిలిచాడు. గౌతమ్ రన్నర్‌అప్‌గా నిలవగా, నిఖిల్‌కు ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించారు. ప్రస్తుతం నిఖిల్ తెలుగులో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలుగులో కొన్ని వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు.

39
వివాదాస్పద విజేతగా పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినా.. ఆయన యూట్యూబర్‌గా, రైతుబిడ్డగా అంతకు ముందే ఫేమస్ అయ్యాడు. హౌస్‌లోకి వచ్చిన ప్రశాంత్ తన ఆటతీరుతో భారీ చర్చకు కారణం య్యాడు. టైటిల్ గెలిచిన తర్వాత బయట జరిగిన గొడవల కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు కూడా. ఆ ఘటనలు బిగ్ బాస్ బ్రాండ్‌పై కూడా ప్రభావం చూపించింది. ప్రస్తుతం ప్రశాంత్ వ్యాపారాల్లో నిమగ్నమై రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో అతని లుక్ మారడంతో విమర్శలు కూడా ఎదురయ్యాయి.

49
సింగర్ రేవంత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఈ సీజన్‌లో శ్రీహాన్ రన్నర్‌అప్‌గా నిలిచాడు. 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకోవడంతో శ్రీహాన్ టైటిల్‌ను కోల్పోయాడు. రేవంత్ బిగ్ బాస్ గెలిచిన తర్వాత పెద్దగా కనిపించలేదు. గతంలో అయినా కొన్ని కార్యక్రమాల్లో కనిపించేవాడు. బిగ్ బాస్ తరువాత రేవంత అంతగా యాక్టీవ్ గా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.. రేవంత. బిగ్ బాస్ టైటిల్ వల్ల అతనికి ప్రత్యేకంగా వచ్చిన అవకాశాలే ఏమీ లేవు.

59
వీజే సన్నీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి మోడలింగ్, సినిమాల్లో చిన్న పాత్రలు, సీరియల్స్‌లో నటించాడు. కళ్యాణ వైభోగం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సన్నీకి అదే బిగ్ బాస్ అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే హైదరాబాద్‌లో రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించినట్టు సమాచారం.

69
అభిజిత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అభిజిత్ విజేతగా నిలిచాడు. హౌస్‌లో చాలామంది అతనికి వ్యతిరేకంగా ఉన్నా, ప్రేక్షకుల సపోర్ట్ తో ఒంటరి పోరాటం చేసి గెలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పాపులర్ అయిన అభిజిత్ బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో బిజీ అవుతాడని భావించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ట్రావెలర్‌గా దేశ విదేశాలు తిరుగుతూ జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సామాన్యుల అగ్నిపరీక్షకు జడ్జ్‌గా కూడా వ్యవహరించాడు.

79
సింగర్ రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. స్టార్ యాంకర్ శ్రీముఖి రన్నర్‌అప్‌గా నిలిచింది. నాగార్జున హోస్టింగ్ ప్రారంభించిన ఈ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫోక్ సింగర్‌గా గుర్తింపు పొందిన రాహుల్ బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో.. రాహుల్ పాపులారిటీ మరింతగా పెరిగింది. అవార్డుల సమయంలో.. ఆస్కార్ స్టేజ్‌పై కూడా పాట పాడే అవకాశం రాహులకు లభించింది. రీసెంట్ గా ఓ రాజకీయ నాయకుడి కుమార్తెను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

89
కౌశల్ మంద

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కౌశల్ మంద విజేతగా నిలిచాడు. కౌశల్ ఆర్మీ పేరుతో భారీ హడావుడి కూడా చేశారు. వివాదాస్పద విన్నర్ గా కౌశల్ నిలిచాడు. ఈ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించగా, కౌశల్ కారణంగా నానిపై కూడా విమర్శలు వచ్చాయి. గెలిచిన తర్వాత కొంతకాలం వార్తల్లో నిలిచిన కౌశల్, ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. రీసెంట్ గా కన్నప్ప సినిమాలో నటిస్తూ మళ్లీ వెండితెరపై కనిపించాడు.

99
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేత – శివ బాలాజీ

2017లో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్ విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివ బాలాజీ బిగ్ బాస్ గెలిచిన తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. ఇటీవల కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం శివబాలాజీ మా అసోషియేషన్ లో.. మంచు విష్ణు టీమ్ లో మెంబర్ గా కొనసాగుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories