Tanikella Bharani: 'శివ' సినిమా సమయంలో తనికెళ్ళ భరణి, రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఈ ఆసక్తికర విషయాలు ఆ సినిమా మేకింగ్‌లో ఉన్న తీవ్రతను తెలియజేస్తాయి. సినిమా విజయంపై కేవలం నాగార్జున మాత్రమే..
టాలీవుడ్ ఇండస్ట్రీను మలుపు తిప్పిన 'శివ' సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ సినిమాకు రచయితగా పనిచేసిన ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుభవాలను, ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో జరిగిన గొడవలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
25
జోకులు వద్దు.. వర్మ కండిషన్!
'శివ' సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది కాబట్టి, భరణి మొదట స్క్రిప్ట్‌లో చాలా జోకులు, సెటైర్లు రాశారట. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణవంశీ ఆ జోకులను విని విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. కానీ వర్మ ఆ స్క్రిప్ట్ చదివి, "కాలేజీలో జోకులు ఉంటాయని నాకు తెలుసు, కానీ నా సినిమాలో ఒక్క జోక్ కూడా ఉండటానికి వీల్లేదు" అని సీరియస్‌గా చెప్పారట. అలా సినిమా మొత్తం సీరియస్‌గా సాగాలని వర్మ కచ్చితమైన నిర్ణయంతో ఉండేవారు.
35
తొలగింపు, కారణం
సినిమా ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు భరణిని టీమ్ నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం స్క్రిప్ట్‌ని స్వయంగా వర్మకు ఇవ్వకుండా ఒక థర్డ్ పర్సన్ ద్వారా పంపడం. "స్క్రిప్ట్ అనేది దైవం లాంటిది, అలాంటి దానిని ఎవరో తెలియని వ్యక్తి ద్వారా పంపడం నాకు నచ్చలేదు" అని వర్మ మొహం మీదే చెప్పారట. మరో కారణం ఏమిటంటే, ఈ సినిమా కథను భరణి వేరే నిర్మాణ సంస్థకు చెప్పారని వర్మ అనుమానించారు.
వర్మతో వాదన జరుగుతున్న సమయంలో భరణి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. "అసలు మన సినిమాలో కథ ఉందా సార్? ఇవన్నీ కొన్ని ఇన్సిడెంట్లు, మంచి స్క్రీన్ ప్లే మాత్రమే కదా" అని అడిగారట. ఆ మాటకు వర్మ ఏమీ అనకుండా, భరణి ఇంటి గోడపై ఉన్న శ్రీదేవి ఫోటోను చూసి, "ఈవిడతో నేను సినిమాలు తీయాలి" అంటూ టాపిక్ మార్చేశారట. ఆ తర్వాత వర్మ తన తర్వాతి సినిమా షూటింగ్ కోసం భరణిని రమ్మని పిలవడంతో ఆ వివాదం ముగిసింది.
55
కేవలం నాగార్జున మాత్రమే..
'శివ' సినిమా సమయంలో తనికెళ్ళ భరణి, రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఈ ఆసక్తికర విషయాలు ఆ సినిమా మేకింగ్‌లో ఉన్న తీవ్రతను తెలియజేస్తాయి. సినిమా విజయంపై కేవలం నాగార్జున మాత్రమే నమ్మకంగా ఉండేవారని, మిగతా వారందరికీ కొన్ని అనుమానాలు ఉండేవని భరణి గుర్తు చేసుకున్నారు.