ఆ తర్వాత తాను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అన్నారు. తన చిత్రానికి ఆదరణ దక్కకపోయే సరికి తట్టుకోలేకపోయాను అని మోహన్ తెలిపారు. మోహన్ శ్రీవత్స తనని తాను చెప్పుతో కొట్టుకోవడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాని నిర్మించిన కోర్ట్, 35 చిన్న కథ కాదు, 23 లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. ప్రేక్షకులని బలవంతంగా థియేటర్లకు రప్పించాలి అనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళకి నచ్చితే వస్తారు లేకుంటే లేదు. దానికి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు అని తమ్మారెడ్డి అన్నారు.