బాలకృష్ణ ఇంట్లో అసలేం జరిగింది, వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్.. రెండున్నరేళ్లు భరించాను అంటూ కామెంట్స్

Published : Sep 05, 2025, 08:22 AM IST

నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఓ హీరోయిన్ బోరున ఏడ్చేశారట. ఆమె తన బాధని బాలయ్యతో చెప్పుకున్నారట. అసలు ఆ హీరోయిన్ ఎందుకు అంతలా బాధపడాల్సి వచ్చింది ?

PREV
15
రాజకీయాల్లో, సినిమాల్లో బాలయ్య జోరు

నందమూరి బాలకృష్ణ ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో వరుస విజయాలు అందుకుంటున్నారు. బాలకృష్ణ వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహా రెడ్డి, డాకు మహారాజ్ ఇలా సినిమాల్లో వరుస హిట్లు కొడుతున్నారు. 

25
రాజకీయాల్లో నటీమణులు

సినీ తారలు రాజకీయాల్లోకి వెళితే వాళ్ళకి మంచి ప్రాధాన్యత లభిస్తుంది. తెలుగుదేశం పార్టీలో బాలయ్య ప్రస్తుతం సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీలో జయప్రద, జయసుధ లాంటి నటీమణులు ఉన్నారు. ఆ తర్వాత రోజా కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపి నుంచి బయటకి వచ్చిన రోజా వైసీపీలో జాయిన్ కావడం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదగడం చూశాం. 

35
దివ్యవాణి సినిమాలు

రోజా తరహాలోనే గతంలో తెలుగు దేశంపార్టీలో సందడి చేసిన మరో హీరోయిన్ ఉన్నారు. ఆమె పేరు దివ్య వాణి. దివ్య వాణి ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ తో సినిమాలు చేశారు. పెళ్లి పుస్తకం, ముత్యమంత ముద్దు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, దోషి లాంటి చిత్రాల్లో దివ్యవాణి నటించారు. 

45
టీడీపీలో దివ్యవాణికి అవమానం 

రాజకీయాలపై ఆసక్తితో ఆమె తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కొంతకాలం టీడీపీలో ఆమె ప్రముఖు మహిళా నాయకురాలిగా కొనసాగారు. మీడియా ముందు ఎక్కువగా కనిపించేవారు. అయితే పార్టీలో తనకి అవమానాలు ఎదురవుతున్నాయని టీడీపీ నుంచి బయటకి వచ్చేశారు. ఓ ఇంటర్వ్యూలో దివ్యవాణి తెలుగుదేశం పార్టీలో తనకి ఎదురైనా అవమానాలు గుర్తు చేసుకుని బాధపడ్డారు. రెండున్నరేళ్ల పాటు అవమానాలు ఎదుర్కొన్నాను. నా మాటకి విలువ ఇచ్చేవారు అక్కడ లేరనిపించింది. 

55
బాలయ్య ఇంటికి వెళ్లి ఏడ్చా 

చివరికి వచ్చేసరికి చులకనగా చూడడం ప్రారంభించారు. నాయకురాలిగా నేను కష్టపడుతున్నప్పుడు.. నాకు ఏం కావాలో పార్టీ నుంచి అందేవి కాదు. దీనికి తోడు చులకన భావం ఎక్కువైంది అని దివ్య వాణి అన్నారు. పార్టీ నుంచి బయటకి వచ్చే ముందు బాలకృష్ణ ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చారట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు. ఇది మీకు ఎలా తెలిసింది అని దివ్యవాణి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది నిజమే అని దివ్యవాణి అన్నారు. నా బాధని చెప్పుకోవడానికి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ముందు బాధపడుతూ జరిగిన సంఘటనలు మొత్తం బాలకృష్ణగారికి చెప్పాను. ఆయన కూడా చాలా బాగా స్పందించారు. జరుగుతున్న సంఘటనలు నాకు కూడా తెలుసమ్మా. సమయం వచ్చినప్పుడు అన్నీ సరిచేద్దాం అని అన్నారు. కానీ ఆ పార్టీలో ఉండలేక తాను బయటకి వచ్చేసినట్లు దివ్యవాణి పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories