పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. నేడు తాజాగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో OG(ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే చిత్రాన్ని ప్రారంభించారు.