గ్రీన్ చుడీదార్ లో మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేశ్.. ట్రెడిషనల్ లుక్ లోనూ మెస్మరైజ్ చేస్తున్న డస్కీ బ్యూటీ

First Published | Jan 30, 2023, 6:41 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ గ్లామర్ మెరుపులతో  మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
 

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సంప్రదాయ దుస్తులకు పెట్టింది పేరు. గ్లామర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఈ బ్యూటీ తన నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంది. 
 

వెండితెరపై తన పెర్పామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. డస్కీ బ్యూటీగా పేరొంది తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. సిప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందీ బ్యూటీ.
 


చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కేరీర్ ను ప్రారంభించింది. తెలుగు చిత్రం ‘రాంబంటు’లో బాలనటిగా అలరించింది.  ఆ తర్వాత హీరోయిన్ గా ‘కౌసల్య క్రిష్ణ మూర్తి’లో నటించి మెప్పించింది. అప్పటికే తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. 

ఇక 2020 నుంచి ‘వరల్డ్ ఫేమస్ లవర్’,‘టచ్ జగదీష్’, ‘రిపబ్లిక్ ’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ప్రస్తుతం తమిళం,  మలయాళంలో ఎడెనిమిది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఐశ్వర్య తన అభిమానులను అలరిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రెడిషన్ లోనే మెరుస్తూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేసేస్తోంది.

తాజాగా గ్రీన్ చుడీదార్ లో మెరిసిన ఐశ్వర్య రాజేశ్ కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న అందాన్ని చూసి యువత ఖుషీ అవుతోంది. దీంతో నెటిజన్ల నుంచి ఐశ్వర్యకు మంచి మద్దతే లభిస్తోంది. లైక్స్, కామెంట్లతో ఆమె ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!