అయితే వీరి విడాకుల వార్తలు మరీ ఎక్కువ అవ్వడంతో.. ఈ వార్తలపై తాజాగా జ్యోతిక స్పందించారు. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. సూర్య చాలా సిన్సియర్ పర్సన్. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు అని చెప్పుకొచ్చింది. మా అమ్మానాన్నలు ముంబైలో ఉంటారు.వారికి ఆరోగ్యం బాగోలేకపోవడం తో నేను ముంబయ్ వచ్చాయి. నా తల్లీ తండ్రులను చూసుకోమని సూర్య ఇక్కడికి పంపించాడు.. అతను ఎంత మంచివాడో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.