విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

First Published | Jul 23, 2024, 11:26 AM IST

తమిళ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లో విలన్ పాత్ర చేయాలంటూ ఆఫర్ వెళ్లిందట.. భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఇంతకీ విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? 
 

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో విశాల్. ఆయన తెలుగు మూలాలు ఉన్న నటుడు కావడంతో విశాల్ ప్రతీ తమిళసినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి. తమిళంలో స్టార్ హీరోగా మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మెయిన్ పిల్లర్ లా వ్యవహరిస్తున్నాడు విశాల్. 
 

Vishal Quit Smoking

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా..నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా..తమిళనాట ఏ ఉపద్రవం వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్పందించే మొదటి వ్యక్తిగా.. విశాల్ కు గుర్తింపు ఉంది. అయితే తెలగులో కూడా విశాల్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ గా విశాల్ ఆంధ్రా నుంచి పొలిటికల్ గా పోటీ కూడా చేస్తాడని టాక్ వస్తోంది. 
 

Latest Videos


ఇక విశాల్ తెలగులో డైరెక్ట్ మూవీ ఎప్పడు చేస్తారని చాలా కాలంగా ప్రశ్న ఎదురవుతోంది. విశాల్ కూడా ఈ ప్రస్తావన చాలా సార్లు తీసుకువచ్చారు. పక్కా తమిళ హీరోలైన విజయ్, ధనుష్ లు డైరెక్ట్ తెలుగు సినిమాలు  చేస్తుంటే.. విశాల్ ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈక్రమంలో దనుష్ తెలుగు లో మంచి ఆఫర్ ఇస్తే వదులుకున్నాడని టాక్. 

Vishal

తమిళం నుంచి కాని.. బాలీవుడ్ నుంచి కాని.. చాలామంది స్టార్ హీరోలు తెలుగులో నెగెటీవ్ రోల్స్ చేస్తున్నారు. కన్నడ సుధీప్ లాంటి వారు కూడా అక్కడ స్టార్ హీరోలు గా ఉండి.. టాలీవుడ్ లో విలప్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. చేశారు. అలాంటి అవకాశమే వచ్చిందట విశాల్ కు. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో హీరోయిజం ఉన్న నెగెటీవ్ రోల్ వచ్చిందట. 

కాని విశాల్ ఈసినిమాను వదిలేసుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకీ అల్లు అర్జున్ హీరోగా విశాల్ విలన్ గా మిస్ అయిన సినిమా మరేదో కాదు వరుడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ ఇది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంట‌గా న‌టించ‌గా.. త‌మిళ హీరో  ఆర్య విలన్ గా నటించి మెప్పించాడు. సినిమా హిట్ అవ్వకపోయినా.. విలన్ గా ఆర్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అయితే  2010లో రిలీజ్ అయిన ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. ఎక్కువగా విజ్యువల్స్, గ్రాఫిక్స్ లాంటి వాటిపై దృష్టిపెట్టిన డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కథను, స్క్రీన్ ప్లేను పట్టించుకోలేదు అని విమర్శలు వచ్చాయి. అయితే ఈసినిమాలో విలన్ గా ముందుగా విశాల్ ను సంప్రదించాడట గుణ శేఖర్. కాని హీరోగా మంచి ఊపు మీద ఉన్న ఆయన తెలుగులో తన మార్కెట్ ను చెడగొట్టుకోవడం ఇష్టం లేక.. రిజెక్ట్ చేశాడట. 

ఈ విషయాన్ని గతంలో విశాల్ ఒక ఇంటర్వ్యులో స్వయంగా చెప్పారు. విశాల్ నో చెప్పాడంతో ఈ అవకాశం ఆర్యను వరించింది.  విశాల్ ఈ సినిమాను చేయకపోవడం తనకు మంచిదే అయ్యిందని అభిప్రాయం వెల్లడవుతోంది. 

click me!