బిగ్ బాస్ తెలుగు 8లో ఊహించని ట్విస్ట్, ఈసారి రెండు హౌస్లు, విన్నర్ డిసైడ్ అయ్యేది ఎలాగంటే?

Published : Jul 23, 2024, 09:07 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 కి మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఫస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ క్రమంలో సీజన్ 8 కి సంబంధించిన కీలక విషయాలు లీక్ అయ్యాయి. ఈసారి రెండు హౌస్లు ప్లాన్ చేశారట.   

PREV
16
బిగ్ బాస్ తెలుగు 8లో ఊహించని ట్విస్ట్, ఈసారి రెండు హౌస్లు, విన్నర్ డిసైడ్ అయ్యేది ఎలాగంటే?
Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 వచ్చేస్తుంది. ఆడియన్స్ రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్ లోకి జారుకున్నారు. కంటెస్టెంట్స్ ఎవరు? హోస్టింగ్ నాగార్జునే చేస్తారా? లేక మరొకరు వస్తారా? షో ఎలా ఉండబోతుంది?... ఇలా అనేక సందేహాలు బిగ్ బాస్ లవర్స్ మైండ్ లో రన్ అవుతున్నాయి. జులై 21న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ చేశారు. తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మీకు అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని కామెంట్ జోడించారు. 

 

26
Bigg Boss Telugu

నాగార్జున పోస్ట్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు ఆయనే తీసుకుంటున్నారు. వరుసగా ఆరో సీజన్ ని నాగార్జున తన సారధ్యంలో నడిపించనున్నారు. కాగా బిగ్ బాస్ 8 లోగో చూసిన బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనాలు వేస్తున్నారు. సీజన్ 8 డిజైన్ ఇలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ రివీల్ చేస్తున్నారు. 
 

36
Pallavi Prashanth

సీజన్ 6 ప్లాప్ కావడంతో సీజన్ 7 కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు. ఉల్టా పల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. గతంలో చూడని పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర వంటి కాన్సెప్ట్స్ సీజన్ 7లో మనం చూశాము. లాంచింగ్ ఎపిసోడ్స్ రెండు నిర్వహించడం కూడా కొత్త టెక్నిక్. లాంచింగ్ ఎపిసోడ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసిన నాగార్జున... ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. 

 

46

ఈ క్రమంలో సీజన్ 7కి మించి విభిన్నంగా సీజన్ 8 రూపొందిస్తున్నారనే వాదన మొదలైంది. అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయట. ఒక మెయిన్ హౌస్, రెండోది లూప్ హౌస్. మెయిన్ హౌస్లోకి రావాలంటే... కంటెస్టెంట్స్ కష్టపడాల్సి ఉంటుంది. గేమ్స్, టాస్క్స్ లో సత్తా చాటిన వారు మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేకుంటారట. 

56
Bigg boss telugu 8

ఈ రెండు ఇళ్ల మధ్యలో ఒక పద్మవ్యూహం అనే కాన్సెప్ట్ కూడా పెట్టారట. మెయిన్ హౌస్లో చివరిగా మిగిలిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడట. ఇలా లోగో ఆధారంగా బిగ్ బాస్ రివ్యూవర్స్ సీజన్ 8 ఇలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఖచ్చితంగా షో ఎలా ఉంటుంది అనేది.. నిర్వాహకులకు మాత్రమే తెలిసిన విషయం. 


 

66
Bigg boss telugu 8

కాగా యూట్యూబర్ బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, బర్రెలక్క, రీతూ చౌదరి, క్రికెటర్ అంబటి రాయుడు, విష్ణుప్రియ, అమృత ప్రణయ్, హేమ, సురేఖావాణి, వేణు స్వామి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. తాజాగా సీనియర్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. లాంచింగ్ ఎపిసోడ్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది అధికారికంగా తెలియదు. 

click me!

Recommended Stories